గోదావరిలో దూకి తల్లి,బిడ్డ ఆత్మాహత్యా యత్నం.. కాపాడిన మత్స్యకారులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన ఓ మహిళ తన చిన్నారితో సహా భద్రాచలం గోదావరి వంతెనపై నుంచి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు ఒక్కసారిగా కేకలు వేయడంతో స్థానికంగా ఉన్న మత్స్యకారులు వారిని వెంటనే కాపాడారు.క్షేమంగా తల్లీబిడ్డను బయటకు తీసుకువచ్చి భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

