ప్రపంచ రంగస్థల దినోత్సవం
ప్రపంచ రంగస్థల దినోత్సవం ప్రతి ఏట మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రంగస్థల కళాకారులచే జరుపబడుతున్న ఉత్సవం. ఇది 1961లో ఇంటర్నేషనల్ థియేటర్ ఇనిస్టిట్యూట్ వారిచే ప్రారంభించబడింది 1961లో వియన్నాలో ఇంటర్నేషనల్ థియేటర్ ఇనిస్టిట్యూట్ వారు నిర్వహించిన 9వ ప్రపంచ కాంగ్రెస్‌లో ఆనాటి అధ్యక్షుడు ‘ఆర్వికివియా’ ప్రపంచ రంగస్థల దినోత్సవ ప్రతిపాదన చేశాడు.రంగస్థల దినోత్సవం ప్రపంచమంతా విస్తరించి ఐక్యరాజ్య సమితి, యునెస్కో లచే ప్రాధాన్యత పొందింది.
రామ్ చరణ్
రామ్ చరణ్ తేజ భారతీయ సినిమా నటుడు. రామ్ చరణ్ తేజ మార్చి 27, 1985న చిరంజీవి, సురేఖ దంపతులకు జన్మించాడు. చరణ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 2007లో విడుదలైన చిరుత చిత్రంతో తెలుగు ప్రజలకు పరిచయమయ్యాడు. ఈ చిత్రం విజయవంతం అవ్వడంతో పాటు తనకు ఆ సంవత్సరానికి ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది.

