ప్రపంచ జల దినోత్సవం
ప్రపంచ నీటి దినోత్సవం ఐరాస జరిపే వార్షిక దినోత్సవం. దీన్ని ఏటా మార్చి 22 న జరుపుతారు. ఇది మంచినీటి ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మంచినీటి వనరుల స్థిరమైన నిర్వహణ గురించి చెప్పేందుకు ఈ రోజును ఉపయోగిస్తారు.1992 బ్రెజిల్ లోని రియో డి జనీరోలో పర్యావరణం, అభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన సమావేశం (UNCED) ఎజెండా 21లో ఈ దినోత్సవాన్ని మొదట ప్రతిపాదించారు. తొలి ప్రపంచ నీటి దినోత్సవం 1993లో జరిగింది.[

