loader

4 అంత‌స్తుల భ‌వ‌నంలో అగ్నిప్ర‌మాదం.. ఢిల్లీలో 9 మంది మృతి

ఢిల్లీలోని పాలెంలో అగ్నిప్ర‌మాదం జ‌రిగిన ఘ‌ట‌న‌లో 9 మంది మృతిచెందారు. మ‌రో ముగ్గురు గాయ‌ప‌డ్డారు. రామ్ చౌక్ మార్కెట్‌లో ఉన్న 4 అంత‌స్తుల భ‌వ‌నంలో ఉద‌యం 7 గంట‌ల‌కు అగ్నిప్ర‌మాదం చోటుచేసుకున్న‌ది. ఆ స‌మ‌యంలో చాలా మంది నిద్ర‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆ భ‌వ‌నం బేస్మెంట్‌, గ్రౌండ్‌ఫ్లోర్‌లో బ‌ట్ట‌ల దుకాణంతో పాటు కాస్మెటిక్స్ షోరూం కూడా ఉన్న‌ది. అయితే బిల్డింగ్‌లోని టాప్ రెండు ఫోర్ల‌లో ఆ ఇంటి య‌జ‌మానులు ఉంటున్నారు.

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఎంపీ బెయిల్‌పై రేవంత్ రెడ్డి స్పందన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై కీలక వివరణ ఇచ్చారు. ఈ ఉదంతంలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌కు స్టేషన్ బెయిల్ లభించడం వెనుక ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. చట్టపరమైన నిబంధనల ప్రకారమే పోలీసుల ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇందులో రాజకీయ జోక్యం లేదని సీఎం వెల్లడించారు. ఈ కేసులో ఉన్న ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

మూసీ డిపిఆర్ తయారుచేయలేదు… దమ్ముంటే మా ముందు పెట్టండి: కెటిఆర్

శాసన సభలో మూసీ పునర్నిర్మాణంపై కెటిఆర్ మాట్లాడారు. రూ.16 వేల కోట్లయ్యే ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్షన్నర కోట్లు అని చెబుతున్నారని, మూసీ డిపిఆర్ తయారు చేసేందుకు 18 నెలలు పడుతుందని జనవరిలో మంత్రి చెప్పారని, ఇప్పుడేమో డిపిఆర్ పూర్తయిందని మంత్రి చెబుతున్నారని, 18 నెలలు పడుతుందని చెప్పి రెండు నెలల్లోనే పూర్తి చేశారా? అని ప్రశ్నించారు. ఒకవేళ డిపిఆర్ పూర్తి చేసి ఉంటే తమ ముందు పెట్టాలని డిమాండ్ చేశారు

పుట్టా మహేష్ పై తేల్చేసిన చంద్రబాబు, పార్టీ వీళ్లను మోయాలా..!!

టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ వ్యవహారం పై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆయన తీరు పై మండిపడ్డారు. తిరుపతి ఎమ్మెల్యేల సమావేశంలో పుట్టా మహేశ్ కుమార్ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. యువకుడు.. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారని అతడికి అవకాశమిచ్చామని వివరించారు. కానీ ఆయన ఈ విధంగా వ్యవహరించారన్నారు. అసలు ఆ పార్టీలకు వెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందంటూ ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

గన్నేరుపప్పు తిని కరీంనగర్ టూ టౌన్ ఎస్‌ఐ చంద్రశేఖర్ భార్య ఆత్మహత్య

కరీనంగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరీంనగర్ టూ టౌన్ ఎస్‌ఐ చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్యకు పాల్పడింది. విషపూరితమైన గన్నేరు పప్పు తినడంతో తీవ్ర అస్వస్థతకు గురైన దివ్యను కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించారు.పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా, చంద్రశేఖర్, దివ్య దంపతులకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. దివ్య ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!

ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్దం మూడు వారాలకు చేరుతోంది. ఇరాన్ జాతీయ భద్రతా మండలి ఛీఫ్ అలీ లారిజానీని ఇజ్రాయెల్ దాడుల్లో కోల్పోయిన ఇరాన్ తాజాగా ప్రపంచ దేశాలకు కీలక హెచ్చరికలు చేసింది. పశ్చిమ ఆసియా సంక్షోభం యొక్క పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా అందరినీ తాకబోతున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి హెచ్చరించారు. ఇరాన్‌పై యుద్ధం అన్యాయమైనదని యూరోపియన్, అమెరికా అధికారులతో సహా పెద్ద సంఖ్యలో గళాలు వినిపిస్తున్నాయని, అంతర్జాతీయ సమాజంలోని ఇతర సభ్యులు కూడా […]

గుజ‌రాత్ అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. కొన‌సాగుతున్న త‌నిఖీలు

గుజ‌రాత్ అసెంబ్లకి ఇవాళ బాంబు బెదిరింపు వ‌చ్చింది. ఈ మెయిల్ ద్వారా ఆ బెదిరింపు చేశారు. ప్ర‌స్తుతం బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. అయితే ఇవాళ స‌మావేశాలు ప్రారంభం కావ‌డానికి ముందే ఈ మెయిల్ వ‌చ్చిన‌ట్లు తెలిసింది. అంసెబ్లీ కాంప్లెక్స్‌లో బాంబును అమ‌ర్చిన‌ట్లు బెదిరింపులో పేర్కొన్నారు. దీంతో అసెంబ్లీ లో ఉన్న సిబ్బంది, ఎమ్మెల్యేల‌ను ప‌రిస‌ర ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు.పోలీసులు పేలుడు ప‌దార్ధాల కోసం సోదాలు మొద‌లుపెట్టారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి అనుమానిత వస్తువును గుర్తించ‌లేదన్నారు.

పేలిన ఎలక్ట్రిక్ కారు… ఏడుగురు సజీవదహనం

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ నగరంలో పుగాలియా అనే వ్యక్తి ఇంటి వరండాలో ఎలక్ట్రిక్ కారుకు ఛార్జీంగ్ పెట్టి నిద్రపోయాడు. ఛార్జింగ్ పాయింట్ వద్ద పేలుడు సంభవించడంలో మంటలు చేలరేగాయి. పాలిమర్స్ కు మంటలు అంటుకోవడంతో భవనం అంతటా మంటలు వ్యాపించాయి. ఇంట్లో నిల్వ ఉంచిన పదికి పైగా గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. ఒకదాని తరువాత ఒకటి పేలడంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఈ మంటల్లో ఏడుగురు సజీవదహనమయ్యారు. ముగ్గురిని స్థానికులు కాపాడారు.

సిద్దిపేటలో స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ

స్కూల్  బస్సును సిమెంట్ లారీ ఢీకొట్టిన సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని ఇబ్రహాంనగర్‌లో జరిగింది. సిద్దిపేటలో రావూస్ స్కూల్ బస్సు పలు గ్రామాలలో విద్యార్థులను పిక్ అప్ చేసుకొని స్కూల్‌కు వెళ్తోంది. ఇబ్రహీంనగర్ స్టేజీ వద్దకు రాగానే బస్సును వెనుక నుంచి సిమెంట్ లారీ ఢీకొట్టింది. బస్సులో ఉన్న పిల్లలు భయంతో కేకలు వేశారు. వెంటనే గ్రామస్థులు పిల్లలను బస్సులో నుంచి బయటకు తీశారు. స్వల్పంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. తొమ్మిది మంది విద్యార్థులు […]

ఎంపీల వీడ్కోలు వేళ ప్రధాని మోదీ భావోద్వేగం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఆసక్తికర పరిణామాల మధ్య కొనసాగుతున్నాయి. ఒకవైపు రాజ్యసభలో పదవీ విరమణ పొందుతున్న సభ్యులకు వీడ్కోలు పలుకుతూ ప్రధాని మోదీ ప్రసంగించగా, మరోవైపు ఎల్పీజీ సంక్షోభంపై విపక్షాలు కేంద్రాన్ని చుట్టుముట్టాయి. రాజ్యసభ నుంచి పదవీ విరమణ పొందుతున్న ఎంపీలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. దేశ నిర్మాణంలో, పార్లమెంటరీ చర్చల్లో వారు పోషించిన పాత్రను కొనియాడారు. సభలో చోటుచేసుకున్న ఈ మార్పును ఒక పరివర్తన కాలంగా ఆయన అభివర్ణించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON