loader

ఖర్గేతో సిఎం రేవంత్ రెడ్డి భేటీ

ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ఖర్గేతో చర్చించినట్టుగా సమాచారం. దీంతోపాటు పార్టీ పదవులు, తదితర అంశాల గురించి సిఎం రేవంత్‌రెడ్డి ఖర్గేతో మాట్లాడినట్టుగా తెలిసింది. ఏఐసిసి నూతన కార్యాలయం ‘ఇందిరా భవన్’లో జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డిలు పాల్గొన్నారు.

ఒడిశాలో కాంగ్రెస్‌కు భారీ దెబ్బ

ఒడిశాలో కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా ఓటు వేసిన ముగ్గురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. సోమవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రమేశ్ చంద్ర జెనా, దశరథి గోమాంగో, సోఫియా ఫిర్డోస్ బీజేపీ మద్దతుతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి దిలీప్ రాయ్‌కు ఓటు వేశారు.ఒడిశా కాంగ్రెస్ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ మాట్లాడుతూ, ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఇలాంటి చర్యలకు పాల్పడతారని ఊహించలేదన్నారు.

కాశ్మీర్‌లో మంచు తుఫాన్.. స్తంభించిన జనజీవనం.. సహాయక చర్యలకు ఆటంకం

కాశ్మీర్‌ను మంచు తుఫాన్ అతలాకుతలం చేస్తోంది. రెండు రోజులుగా మంచు తుఫానుతోపాటు వర్షం కూడా జమ్ము కాశ్మీర్ ప్రజల్ని ఇబ్బంది పెట్టింది. మంగళవారం ఉదయం కాస్త తెరిపినిచ్చినా తర్వాత మంచు కురుస్తూనే ఉంది. దీంతో లోయలో జనజీవనం స్తంభించింది. చాలా చోట్ల 12 అంగుళాల మేర మంచు కురుస్తోంది. జోజిలా పాస్ ప్రాంతంలో 5 అంగుళాలు, సోనామార్గ్ ప్రాంతంలో 3-4 అంగుళాల మంచు కురుస్తోంది. ఇండియన్ ఆర్మీకి చెందిన 19 రాష్ట్రీయ రైఫిల్స్ దళాలు సహాయక చర్యలు […]

మోయినాబాద్ డ్రగ్స్ కేసు.. 9 మంది అధికారులతో సిట్ ఏర్పాటు..!

రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన మోయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసును సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(SIT) ఏర్పాటు చేసింది. రిమాండ్‌లో ఉన్న నిందితులను విచారించడం, డ్రగ్స్ పార్టీపై లోతుగా విచారణను జరపడం కోసం తొమ్మది మంది అధికారులకు బాధ్యతలు అప్పగించింది. సీపీ సుధీర్ బాబు పర్యవేక్షణలో ప్రత్యేక బృందం ఈ కేసును దర్యాప్తు చేయనుంది.సిట్‌ చీఫ్‌గా చీఫ్‌గా చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ వ్యవహరించనున్నారు.

గుజరాత్‌కు చేరిన భారత్ రెండో ఎల్‌పీజీ నౌక

పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో దేశంలో ఎల్‌పిజి కొరత వెంటాడుతున్న సమయంలో 46,500 టన్నుల గ్యాస్‌తో కూడిన నందాదేవి నౌక సురక్షితంగా గుజరాత్‌లోని వదినార్ పోర్టుకు చేరుకుంది. హోర్ముజ్ జలసంధిని దాటుకుని భారత్ చేరుకున్న రెండో భారీ ఎల్‌పిజి నౌక ఇది.ఈ నౌక నుంచి బిడబ్లు బిర్చ్ అనే మరో చిన్న నౌకకు ఈ ఎల్‌పీజీని అన్‌లోడ్ చేస్తారు.  ఈ బదిలీ ప్రక్రియలో గంటకు 1000 టన్నుల వంతున మొత్తం అన్‌లోడింగ్ పూర్తవడానికి రెండు రోజులు పడుతుంది.

‘లక్షకు నెలకు పది వేలు’ అంటూ గాలం – కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన కన్సల్టెన్సీ!

గుంటూరులో ‘నవ్య శ్రీ వారాహి బిజినెస్ కన్సల్టెన్సీ’ పేరుతో పూర్ణచంద్రరావు అనే వ్యక్తి మరికొందరితో కలిసి ప్రారంబించి ఒక స్కీమ్ ప్రకటించాడు. లక్ష రూపాయలు ఇస్తే, వాటితో షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తామని నమ్మించాడు. ఆ లాభాల్లో నెలకు రూ. 10 వేలు చొప్పున 20 నెలల పాటు చెల్లిస్తామని ఆశ చూపాడు. భారీగా డిపాజిట్లు చేయించారు. ఇలా వందల మంది నుంచి కోట్లు వసూలు చేశారు.తీరా మార్చి 13వ తేదీన ఎవరికీ చెప్పకుండా నిర్వాహకులు ఆఫీసుకు […]

కూకట్‌పల్లి హవాలా డబ్బు దొంగల అరెస్ట్.. రూ.77.30 లక్షలు రికవరీ..!

కూకట్‌పల్లిలో పట్టపగలే కలకలం రేపిన దారి దోపిడీ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. బండిమీద హవాలా డబ్బును తీసుకెళ్తున్న వారి కళ్లల్లో కారం చల్లి రూ. కోటి ఎత్తుకెళ్లిన వారిని అరెస్ట్ చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి రూ.77.30 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఐదుగురిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

అన్నింటికి కాలమే సమాధానం చెబుతుంది:రజినీకాంత్

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ గతంలో చేసిన రాజకీయ ప్రయత్నాలను డీఎంకే అడ్డుకుందని, ఆయనను బెదిరించిందని నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఆదవ్ అర్జున వ్యాఖ్యలపై డీఎంకేతో పాటు రజనీకాంత్ అభిమానులు తీవ్రంగా మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు సత్యదూరం అని, కాలమే ఇలాంటి వాటికి సమాదానం చెబుతుందనారు.ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ నాకు మద్దతుగా నిలిచిన నా అభిమాన దేవుళ్లకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కాలం మాట్లాడకపోవచ్చు, కానీ సరైన సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది అని పేర్కొన్నారు.

పుట్టా మహేశ్ డ్రగ్స్ వ్యవహారం పై జగన్ ఫైర్

టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడటం పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి అని వైఎస్ జగన్ విమర్శించారు. కూటమి ప్రభుత్వ అండదండల వల్లే రాష్ట్రంలో మాదక ద్రవ్యాల దందా విచ్చలవిడిగా సాగుతోందని ఆయన ఆరోపించారు. ఇలాంటి అసాంఘిక శక్తులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని జగన్ నిలదీశారు. రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు పెరుగుతున్నా ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని జగన్ దుయ్యబట్టారు.  బాలకృష్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, పాలకుల […]

నాకు నయనతార కావాలి- స్టాలిన్ నా కోరిక తీరుస్తారా?: AIADMK ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

సీఎం స్టాలిన్ తాజాగా ప్రకటించిన ‘మీ కలను మాతో చెప్పండి’ కార్యక్రమాన్ని ఉద్దేశించి వేణుగోపాల్ షణ్ముగం వివాదాస్పద కామెంట్స్ చేశారు. తనకు హీరోయిన్ నయనతార కావాలని, ఈ కోరికను తీరుస్తారా అని సీఎం స్టాలిన్‌ను ఆయన ప్రశ్నించారు. ఎవరికైనా నయనతారను పెళ్లి చేసుకోవాలని ఉంటే, ఆ కోరికను ముఖ్యమంత్రి నెరవేరుస్తారా అని AIADMK రాజ్యసభ ఎంపీ సీ వేణుగోపాల్ షణ్ముగం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలపై నేర ఘటనల పెరుగుదల,  వంటి అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే నిరసన […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON