నీట్ యుజి దరఖాస్తు గడువు పెంపు
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యుజి (నీట్ యుజి 2026) దరఖాస్తు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం(మార్చి 8)తో దరఖాస్తు గడువు ముగియగా, దానిని ఈ నెల 11వ తేదీ రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

