కొత్త దంపతులకు సీఎం రేవంత్ ఆశీస్సులు.. విజయ్-రష్మిక ఇంట్లో సందడి!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులను కలిశారు. ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట నివాసానికి వెళ్లిన సీఎం, వారికి పుష్పగుచ్ఛం అందించి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త దంపతులు రేవంత్ రెడ్డికి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో కూడా సీఎం కాసేపు ముచ్చటించారు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ఇంటికి వెళ్లి ఆశీర్వదించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

