చేతిలో త్రిశూలం..నుదిటిపై తిలకం..సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ వేడుకల్లో ప్రధాని మోదీ..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మూడు రోజుల గుజరాత్ పర్యటనను శనివారం ఆధ్యాత్మిక క్షేత్రం సోమనాథ్‌లో అత్యంత వైభవంగా ప్రారంభించారు. మన నాగరికత ధైర్యసాహసాలకు సోమనాథ్ ఒక అద్భుతమైన చిహ్నమని కొనియాడారు. 1026లో సోమనాథ్ ఆలయంపై జరిగిన మొదటి దాడికి వెయ్యి సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్‌లో పాల్గొనడం తన అదృష్టమని ఆయన తెలిపారు. ప్రధాని మోడీ సోమేశ్వర్ మహాదేవ్ మహా ఆరతిలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

