
2026లో జరగబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ కోసం క్వాలిఫైయింగ్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 20 జట్లతో కూడిన తుది జాబితా ఖరారైంది. ఒమన్‌లో జరిగిన ఆసియా – ఈఏపీ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో జపాన్‌ను ఓడించి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ ప్రపంచకప్‌కు అర్హత సాధించిన చివరి 20వ జట్టుగా నిలిచింది. ఈ క్వాలిఫైయింగ్ ద్వారా నేపాల్, ఒమన్‌తో పాటు యూఏఈ కూడా ప్రపంచకప్‌లో చోటు దక్కించుకుంది