loader

భారత్‌లో వీసా సర్వీస్ ఫీజును పెంచిన న్యూజిలాండ్

వీసా దరఖాస్తు కేంద్రాల్లో వసూలు చేసే సర్వీస్ ఫీజును జనవరి 1 నుంచి కొన్ని కేంద్రాల్లో పెంచుతున్నట్టు న్యూజిలాండ్ ప్రకటించింది. భారత్ సహా 25 దేశాల్లో ఈ పెంపు అమలు లోకి రానుంది. నిర్వహణ పరమైన వ్యయాలు, ద్రవ్యోల్బణం కారణంగా ఈ నిర్ణయం తీసుకోవలని వచ్చిందని న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. వీసా అప్లికేషన్ ఫీజుకు వీసా దరఖాస్తు కేంద్రాలు వసూలు చేసే ఫీజు అదనమని స్పష్టం చేసింది. దరఖాస్తులు సమర్పించే ముందు దరఖాస్తుదారులు ఫీజు వివరాలను […]

కల్యాణ్ వర్సెస్ తనూజ..హోరా హోరీగా గ్రాండ్ ఫినాలే ఓటింగ్..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆఖరి అంకానికి చేరుకుంది. ఆదివారం (డిసెంబర్ 21) రాత్రి ఈ షో ఫైనల్ ఎపిసోడ్ జరగనుంది. పేరుకు ఐదుగురు ఫైనలిస్ట్‌లు ఉన్నా టైటిల్ రేసు మాత్రం ప్రధానంగా ఇద్దరి మధ్యే ఉంది. వాళ్లిద్దరే పవన్ కళ్యాణ్ పడాల, తనూజ పుట్టస్వామి. ఈ క్రమంలో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్ లైన్స్ కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఓటింగ్ కు ఇంకా చాలా టైమ్ ఉంది. కాబట్టి ఏవైనా మార్పులు సంభవించే […]

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ-పరిపూర్ణ కళాకారుడిని గుర్తుచేసుకున్నాం

ఇవాళ పరిపూర్ణ కళాకారుడిని గుర్తు చేసుకుంటున్నామని, సినీ చరిత్రలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు చిరస్థాయిగా ఉంటుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. బాల సుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటు మన తెలుగు ప్రజలందరికీ గౌరవం అని భావిస్తున్నానని బండారు దత్తాత్రేయ తెలిపారు. బాలు ఓ కులం, ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదని,  సంగీతానికి ప్రాంతం, భాషా బేధం లేదని, ఎస్పీ అభిమానుల కోరిక మేరకు విగ్రహం ఏర్పాటు చేసినట్లు వివరించిన మంత్రి సంగీత ప్రపంచ రారాజు బాలు […]

రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ 

బహుముఖ ప్రజ్ఞతో తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన గాన గంధర్వుడి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం అతిథులు, కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. సినిమాల్లో బాలు తొలి పాట పాడిన రోజుని పురస్కరించుకొని ఇవాళ విగ్రహావిష్కరణ చేపట్టారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ గవర్నర్‌ దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్‌ బాబు విగ్రహాన్ని ఆవిష్కరించారు.టన్ను కాంస్యంతో దాదాపు 3 నెలలపాటు శ్రమించి 7.2 అడుగుల బాలు కాంస్య విగ్రహాన్ని ఏపీలోని తూర్పు […]

ఇది తమిళనాడు.. అహంకార బీజేపీ ఇక్కడ గెలువలేదు : సీఎం స్టాలిన్‌

బీహార్‌ విజయవంతమయ్యామని, ఇక తమిళనాడు రాష్ట్రమే తమ టార్గెట్‌ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై సీఎం స్టాలిన్ స్పందించారు. ఇది తమిళనాడు రాష్ట్రమని, ఇక్కడ అహంకార బీజేపీ ఎప్పటికీ గెలవలేదని వ్యాఖ్యానించారు. అహంకారం కలిగిన ఏ పార్టీకి ఇక్కడ అవకాశం లేదని అన్నారు. అహంకారంతో ఊగిపోయే ఏ రాజకీయ శక్తినైనా తాము ప్రతిఘటిస్తామని స్టాలిన్‌ స్పష్టంచేశారు. ప్రేమతో తమ వద్దకు వస్తే ఆలింగనం చేసుకుంటామని, అహంకారంతో వస్తే మాత్రం తలవంచే పరిస్థితి లేదని […]

విద్యార్థులకు ఇచ్చిన మాటను 10 రోజుల్లోనే నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం

పల్నాడు జిల్లా చిలకలూరిపేట శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలోని మంచి పుస్తకాలను సెలక్ట్ చేసి పంపుతాను. 25 కంప్యూటర్లు అందిస్తాను’’ అని చెప్పారు. 10 కంప్యూటర్‌లు మాత్రమే ఉన్నాయి. నా వైపు నుంచి ఒక ఫుల్ లైబ్రరీ ప్రొవైడ్ చేస్తాను అన్న మాట ప్రకారం కేవలం 10 రోజుల్లోనే శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు […]

వాసాలమర్రిలో ఓటు మిస్సింగ్‌ .. టాస్‌ వేసి కాంగ్రెస్‌ అభ్యర్థిని విజేతగా ప్రకటించిన అధికారులు

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో ఎన్నికల అధికారుల తీరుతో బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థి ఓడిపోయారు. వాసాలమర్రిలో బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థి ఓటు మిస్‌ అయ్యింది. దీంతో బీఆర్ఎస్‌ బలపరిచిన అభ్యర్థికి, కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థికి సమాన ఓట్లు పోలయ్యాయి. దీంతో ఎన్నికల అధికారులు టాస్‌ వేసి కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థిని విజేతగా ప్రకటించారు. అయితే మరుసటి రోజు కౌంటింగ్‌ రూమ్‌ కిటికీ వద్ద మిస్సయిన ఓటు లభించింది. అందులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఓటు పడటం […]

పొట్టి శ్రీరాములు ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు: సీఎం చంద్రబాబు

తెలుగుజాతి గుర్తింపు కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన ఏకైక నాయకుడు పొట్టిశ్రీరాములు అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయన జీవితం భవిష్యత్తు తరాలకు తెలియాలన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన తర్వాత తెలుగుజాతి గుర్తింపు కోసం పోరాడిన మహనీయులని కొనియడారు. 2026 మార్చి 16 పొట్టిశ్రీరాములు శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుందామని ప్రకటించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టిశ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు.

దిల్లీ ఈవెంట్​లో మెస్సిని కలిసిన జై షా- ఫుట్​బాల్ స్టార్​కు టీ20 వరల్డ్​కప్ టికెట్

అర్జెంటినా ఫుట్​బాస్ దిగ్గజం లియోనల్ మెస్సి గోట్ టూర్ ఆఫ్ ఇండియా పర్యటన ముగిసింది. సోమవారం దిల్లీ ఈవెంట్​తో మెస్సి టూర్ కంప్లీట్ అయ్యింది. మూడు రోజులుగా భారత పర్యటనలో ఉన్న మెస్సి సోమవారం దిల్లీలో సందడి చేశాడు. మెస్సికి జై షా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. మెస్సికి భారత క్రికెట్ జట్టు జెర్సీ, బ్యాట్‌ను బహుకరించాడు. అలాగే మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్​ టికెట్‌ ఇచ్చారు.

దేశ రాజకీయాల్లో కీలక మార్పులు – ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా, ప్రశాంత్ కిషోర్ మధ్య రహస్య మీటింగ్ జరిగిందని రాజకీయవర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. సోనియా గాంధీ నివాసం 10, జనపథ్‌లో గత వారం జరిగిన ఈ సమావేశం నాలుగు గంటల పాటు సాగినట్లుగా తెలుస్తోంది. బీహార్ ఎన్నికల్లో జన సురాజ్, కాంగ్రెస్ రెండూ ఘోరంగా ఓడిపోయాయి. ఈ సమయంలో ప్రియాంకతో పీకే భేటీ హాటా టాపిక్ గా మారింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON