అర్జెంటినా ఫుట్బాస్ దిగ్గజం లియోనల్ మెస్సి గోట్ టూర్ ఆఫ్ ఇండియా పర్యటన ముగిసింది. సోమవారం దిల్లీ ఈవెంట్‌తో మెస్సి టూర్ కంప్లీట్ అయ్యింది. మూడు రోజులుగా భారత పర్యటనలో ఉన్న మెస్సి సోమవారం దిల్లీలో సందడి చేశాడు. మెస్సికి జై షా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. మెస్సికి భారత క్రికెట్ జట్టు జెర్సీ, బ్యాట్‌ను బహుకరించాడు. అలాగే మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్ టికెట్ ఇచ్చారు.

