loader

హిట్‌మ్యాన్ గుడ్ బై..!

టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాకు గుడ్ బై చెప్పాడు. ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన సిడ్నీకి వీడ్కోలు పలికాడు. దీనికి సంబంధించిన ఫొటోను హిట్‌మ్యాన్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘చివరిసారిగా సిడ్నీ నగరానికి వీడ్కోలు పలుకుతున్నాను’ అంటూ క్యాప్షన్‌తో గుడ్ బై చెబుతున్న ఫొటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆల్‌టైమ్ గ్రేట్.. సిడ్నీ కింగ్.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మస్కట్‌లో సిరిసిల్ల యువకుడి నరకయాతన..సెల్ఫీ వీడియో

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగ్గళ్ళపల్లి మండలం బస్వాపూర్ చెందిన సతీష్‌ అనే యువకుడు మస్కట్‌లో పీకల్లోతు సమస్యల్లో చిక్కుకున్నాడు. తినడానికి సరైన ఆహారంలేక, రోజులు గడవడం కూడా కష్టంగా మారింది. తన పరిస్థితిని ఎవరికీ చెప్పుకోవాలా..? అని ఆవేదనతో కన్నీరు పెట్టుకున్న సతీష్‌ చివరకు తన బాధను సెల్ఫీ వీడియో రూపంలో బయటపెట్టాడు. ఈ వీడియోలో సతీష్‌ తన గోడునంత వెల్లగక్కాడు. నన్ను భారత్‌కు తీసుకెళ్లండి. ‘మా అమ్మా నాన్న దగ్గరికి వెళ్లాలనుంది‘ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

కేశినేని చిన్ని పై స్ట్రాంగ్ కౌంటర్

టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని వ్యాఖ్యలకు మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌తో తాను ఎప్పుడూ నేరుగా మాట్లాడలేదని, టీవీలో మాత్రమే చూశానని నాని స్పష్టం చేశారు. తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదని, కేశినేని చిన్ని అంటే కూడా భయం లేదని, కేశినేని చిన్ని పరిస్థితి చూస్తే గొడుగుపేట వెంకటేశ్వరస్వామి ఎఫెక్ట్ కనిపిస్తోందని విమర్శించారు. గొడుగుపేట వెంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే ఎవరికైనా పతనం తప్పదని, చిన్నితో పాటు ప్రభుత్వ పెద్దల పతనం […]

మైనార్టీ గురుకులాల్లో చదివిన ఎంబీబీఎస్‌ విద్యార్థులను సన్మానించిన కేటీఆర్‌, హరీశ్‌రావు

జహీరాబాద్ లోని (TMREIS) తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో చదివి ఎంబీబీఎస్‌లో సీటు పొందిన విద్యార్థులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు సన్మానించారు. ఎంబీబీఎస్ సీట్ సాధించిన మైనార్టీ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులను కేటీఆర్ , హరీశ్‌ రావు శాలువతో సత్కరించి సన్మానించారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 203 మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేసింది కేసీఆర్ అని స్పష్టం చేశారు.

ఐర్లాండ్‌ నూతన అధ్యక్షురాలిగా కేథరీన్‌ కన్నోలి

ఐర్లాండ్‌ అధ్యక్ష ఎన్నికల లో వామపక్షవాద స్వతంత్ర నేత కేథరీన్‌ కన్నోలి ఏకపక్షంగా ఘన విజయం సాధించారు. ఆమెకు సిన్‌ ఫెయిన్‌తోపాటు వామపక్ష పార్టీలన్నీ మద్దతిచ్చాయి. దాంతో ఆమె ప్రత్యర్థి, సెంటర్‌ రైట్‌ పార్టీ అయిన ఫైన్‌ గాయెల్‌ అభ్యర్థి హీథర్‌ హంప్రేయ్స్‌ ఘోర పరాజయం పాలయ్యారు. ఈ ఎన్నికల్లో కేథరీన్‌కు మొదటి ప్రాధాన్య ఓట్లలోనే ఏకంగా 63 శాతం ఓట్లు దక్కాయి. గాజాపై ఇజ్రాయెల్‌ దాడులను ఆమె బహిరంగంగా వ్యతిరేకించారు. ఇజ్రాయెల్‌ను టెర్రరిస్టు దేశంగా అభివర్ణించారు.

సైకిల్‌పై ఏకంగా ఈఫిల్‌ టవర్‌ ఎక్కి…

ఫ్రెంచ్‌ సైక్లిస్ట్‌, టిక్‌టాక్‌ స్టార్‌ అరోలియాన్‌ ఫాంటోనోయ్‌ మామూలోడు కాదు… సైకిల్‌పై ఏకంగా ఈఫిల్‌ టవర్‌ ఎక్కి అరుదైన రికార్డు సృష్టించాడు. ఎక్కడా ఆపకుండా, కాళ్లు నేలపై పెట్టకుండా ఏకంగా 686 మెట్లను కేవలం 12 నిమిషాల 30 సెకన్లలో ఎక్కి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇలాంటి ఫీట్స్‌ సాధించడం ఫాంటోనోయ్‌కు కొత్తేమీ కాదు. 2021లో ప్యారిస్‌లోని ట్రినిటీ టవర్‌, ఈ ఏడాది ఎస్టోనియాలోని టాలిన్‌ టీవీ టవర్‌ను సైకిల్‌పై అలవోకగా ఎక్కి ‘ఔరా’ అనిపించాడు.

కర్నూలు బస్సు ప్రమాదంలో 18 మంది మృతదేహాలు అప్పగింత

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్నూలు బస్సు దుర్ఘటనలో మరణించిన వారిలో 19 మంది మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. మూడు రోజుల అనంతరం ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికల ఆధారంగా 19 మృతదేహాల్లో 18 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించారు. మరణ ధ్రువీకరణ పత్రాలను కూడా వారికి అందించారు. మృతదేహాలను స్వస్థలాలకు చేర్చేందుకు అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు.

TTDలో నెయ్యి నిల్వకు టెక్నాలజీ టచ్..CSK భారీ విరాళం..!

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు నిత్యాన్న ప్రసాదంలో ఉపయోగించే.. పవిత్ర నెయ్యి ఇప్పుడు కొత్త రూపంలో నిల్వ చేయనున్నారు. ఆధునిక సాంకేతికతతో, అధిక నాణ్యతతో, దీర్ఘకాల నిల్వ సామర్థ్యంతో కొత్త ట్యాంకులు, యంత్రాల నిర్మాణం వేగంగా సాగుతోంది. ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న పెద్ద చేయి.. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమ్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎన్. శ్రీనివాసన్. ఆయన సహకారంతో మొత్తం 2.24 లక్షల కిలోల నెయ్యిని నిల్వ ఉంచే సామర్థ్యంతో నాలుగు కొత్త […]

ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకిల మోత..

కాంగ్రెస్‌ది ఇంట్లో ఈగల మోతా.. బయట పల్లకిల మోతా అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. పంపకాల్లో తేడా వచ్చి మంత్రులు, ముఖ్యమంత్రి తన్నుకుంటున్నారని అన్నారు. మొన్న కొండా సురేఖ బిడ్డ, నిన్న జూపల్లి కృష్ణారావు ఎలా మాట్లాడారో చూశారు కదా అని తెలిపారు. క్యాబినెట్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి, మంత్రులు బట్టలూడదీసుకొని తిట్టుకున్నారట అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజల గురించి చూడటం లేదని.. వాళ్లు తన్నుకోడానికి, వాటాలు పంచుకోవడానికి సరిపోతుందని విమర్శించారు. మల్లా కేసీఆర్ వస్తేనే ప్రజలకు మేలు […]

దేశంలో ఏకంగా 22 ఫేక్‌ యూనివర్సిటీలు.. హెచ్చరించిన యూజీసీ

దేశంలో మొత్తం 22 ఫేక్‌ యూనివర్సిటీలు ఉన్నాయని ‘యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC)’ హెచ్చరించింది. ఢిల్లీలోని కోట్లా ముబారక్‌పూర్‌లోగల ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ సంస్థ విషయంలో యూజీసీ మరోసారి హెచ్చరికలు చేసింది. ఆ యూనివర్సిటీ అనుమతులు లేని డిగ్రీ కోర్సులను నిర్వహిస్తోందని పేర్కొంది. ఆ సంస్థ జారీచేసే డిగ్రీలకు ఎలాంటి విలువ లేదని తెలిపింది. అసలు ఈ విశ్వవిద్యాలయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలకు సంబంధించిన ఏ చట్టాలకు లోబడి ప్రారంభించలేదని యూజీసీ స్పష్టం చేసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON