loader

భారత్‌లో 880 టన్నులకు చేరిన బంగారం నిల్వలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన బంగారు నిల్వలను పెంచుతూనే ఉంది. సెప్టెంబర్ చివరి నాటికి ఆర్బీఐ మొత్తం బంగారు నిల్వలు 880 టన్నులను దాటాయి. ఆర్బీఐ విడుదల చేసిన డేటా ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ బంగారు నిల్వలు 880 టన్నుల మార్కును అధిగమించాయి. దేశ చరిత్రలోనే తొలిసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వద్ద ఉన్న బంగారం నిల్వల విలువ 100 బిలియన్ డాలర్ల […]

లవ్​ జిహాద్​కు వ్యతిరేకంగా కొత్త చట్టం- అసోంలో

అసోంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లవ్​ జిహాద్​కు వ్యతిరేకంగా నూతన బిల్లును తీసుకురానున్నట్లు ప్రకటించింది. “ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో చారిత్రక బిల్లులను ప్రవేశపెట్టనున్నాం. లవ్​ జిహాద్​, బహుభార్యత్వం, సత్రాల రక్షణ లాంటి కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాం. ఈ బిల్లులను సభలో పెట్టి చర్చిస్తాం. డ్రాఫ్ట్ బిల్లులకు కేబినెట్​ ఆమోదం తెలిపాక మీడియాకు వివరిస్తాం” అని హిమంత బిశ్వ శర్మ అన్నారు.

సీఎం చంద్రబాబు దుబాయ్ పర్యటనలో కీలకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యూఏఈలో పర్యటిస్తున్నారు. తొలిరోజు పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు దుబాయ్‌లోని ప్రముఖ సంస్థ శోభా రియాల్టి ఫౌండర్ చైర్మన్ పీఎన్సీ మీనన్‌తో భేటీ అయ్యారు. అమరావతిలో రూ.100 కోట్లతో ప్రపంచ స్థాయి గ్రంధాలయం ఏర్పాటుకు శోభా గ్రూప్ చైర్మన్ పీఎన్సీ మీనన్ విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రియాల్టి, టౌన్ షిప్‌లు, లగ్జరీ హోటళ్ల నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు.

యూకే వెళ్లే విద్యార్థులకు బ్యాడ్ న్యూస్..

ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లాలనుకునే విద్యార్థులకు చేదు వార్త. 2026 విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లాండ్ లోని యూనివర్శిటీలు ఏటా తమ ట్యూషన్ ఫీజులను పెంచనున్నాయి. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఈ పెంపు ఉంటుందని యూకె ప్రభుత్వం వెల్లడించింది. విశ్వవిద్యాలయాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూకే విద్యాశాఖ మంత్రి బ్రిడ్జెట్ ఫిలిప్సన్ తెలిపారు. ఈమేరకు అక్కడి పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడుతూ బ్రిడ్జెట్ ఈ విషయాన్ని వెల్లడించారు.

సర్వీసులో ఉన్న టీచర్లకూ టెట్‌ రాసే అవకాశం- పాఠశాల విద్యాశాఖ

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) రాసేందుకు ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లకూ అవకాశం కల్పించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 2011కు ముందు టెట్‌ లేకుండా ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించిన టీచర్లకూ టెట్‌ రాసుకునే అవకాశం కల్పిస్తున్నారు. రెండురోజుల్లో టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్‌ పాస్‌ కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబరు 1న తీర్పు వెలువరించింది.

ప్రసూతి సమయంలో వైద్య సేవలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

ఆధునిక వైద్య విధానాలు అందుబాటులో ఉన్న తరుణంలో ప్రసూతి సమయంలో అందించే సేవలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి ఎప్పటికప్పుడు ఇందుకు సంబంధించిన సేవలపై అనుభవజ్ఞులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డను ప్రసవించిన అనంతరం అపస్మారక స్థితికి చేరుకోవడం, కాకినాడ ఆసుపత్రికి తరలించగా మృతిచెందారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి సమీక్ష […]

‘రాష్ట్రానికి మేలు జరుగుతుందంటే పాలసీలు మారుస్తాం’ – సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు యూఏఈలో తన తొలి రోజు పర్యటన ప్రారంభించారు. ఏపీ-యూఏఈ మధ్య పారిశ్రామిక బంధం బలపడేలా సహకరించాలని సీఎం చంద్రబాబు దుబాయిలోని భారత రాయబార కార్యాలయం ప్రతినిధులను కోరారు. దుబాయ్, అబుదాబి దేశాల్లో భారత రాయబార కార్యాలయం ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. దుబాయ్ ఇండియన్ కాన్సుల్ జనరల్ సతీశ్ కుమార్ శివన్, అబుదాబిలోని ఇండియన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్నాథ్‌తో సీఎం సమావేశమయ్యారు.

జేసీకి షాక్.. చర్యలు తీసుకుంటామన్న ఎస్పీ..

ఏఎస్పీ రోహిత్‌పై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జిల్లా ఎస్పీ జగదీష్‌ స్పందించారు. ప్రభాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిజాయితీగా పనిచేసే అధికారిపై బెదిరింపు ధోరణి తగదని హితవుపలికారు. ఇలా బెదిరింపు ధోరణితో మాట్లాడటం చట్టరీత్యా నేరమన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గన్‌ లైసెన్స్‌ పైనా లీగల్‌ ప్రొసీజర్‌ ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ జగదీష్‌ పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఏఎస్పీ రోహిత్‌పై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు […]

అమెజాన్‌కు షాక్.. ముగ్గురు డైరెక్టర్లపై నాన్ బెయిలబుల్ వారెంట్..

ఒక ఫోన్‌కు బదులు మరో ఫోన్ డెలివరీ చేసిన కేసులో ముగ్గురు అమెజాన్ డైరెక్టర్లపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. బెంగళూరులోని ఇద్దరు, పాట్నాలోని ఒక డైరెక్టర్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఐఫోన్ 15 ప్లస్‌కు బదులు ఐక్యూ ఫోన్ డెలివరీ అయింది. ఆధారాలతో కన్సూమర్ ఫోరమ్‌ను ఆశ్రయించిన. అమెజాన్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో ఆగ్రహించిన కన్సూమర్ ఫోరమ్ ముగ్గురు అమెజాన్ డైరెక్టర్లపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON