ముఖ్యమంత్రి చంద్రబాబు యూఏఈలో తన తొలి రోజు పర్యటన ప్రారంభించారు. ఏపీ-యూఏఈ మధ్య పారిశ్రామిక బంధం బలపడేలా సహకరించాలని సీఎం చంద్రబాబు దుబాయిలోని భారత రాయబార కార్యాలయం ప్రతినిధులను కోరారు.
దుబాయ్, అబుదాబి దేశాల్లో భారత రాయబార కార్యాలయం ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. దుబాయ్ ఇండియన్ కాన్సుల్ జనరల్ సతీశ్ కుమార్ శివన్, అబుదాబిలోని ఇండియన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్నాథ్తో సీఎం సమావేశమయ్యారు.

