loader

ఆక్వా రైతులకు శుభవార్త చెప్పిన లోకేశ్

ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగానికి పెద్ద ఊరటనిచ్చే శుభవార్తను మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. తెల్లమచ్చ వైరస్ వ్యాప్తి కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా ఆస్ట్రేలియా ప్రభుత్వం భారతదేశం నుంచి రొయ్యల ఎగుమతులపై విధించిన పరిమితులను తాజాగా ఎత్తివేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని రొయ్యల ఉత్పత్తిదారులు అంతర్జాతీయ మార్కెట్లలో మళ్లీ తమ స్థానం పొందే అవకాశమొచ్చింది. ఎగుమతుల పునరుద్ధరణతో లక్షలాది ఆక్వా రైతులకు ఉపశమనం లభించనుంది.

మిగిలిన నూనె కోసం జనం పోటీ: అయోధ్యలో వైరల్ వీడియో

అయోధ్యలో ఘనంగా జరుగిన దీపోత్సవం ముగిసిన తర్వాత స్థానిక ప్రజల మధ్య కొందరు దీపాల్లో మిగిలిన నూనెను సేకరించేందుకు ప్రయత్నించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఈ వీడియోను షేర్ చేశారు. “వీడీ షోచేసిన నిజ పరిస్థితి ఇది, దీపోత్సవం అనంతరం వచ్చే చీకటిని గుర్తు చేస్తుంది” అన్నారు. ఆయన భావన ప్రకారం, ప్రభుత్వ అట్టహాసమైన వేడుకలు కొంతమంది ప్రజలకు నేరుగా ప్రయోజనం ఇవ్వలేకపోతున్నాయని సూచించారు.

ప్రభుత్వ టీచర్లకు బిగ్ షాక్.. ఆఖరి ఆశలు గల్లంతు..!

దేశవ్యాప్తంగా ఉన్న టీచర్లకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (NCTE) షాక్ ఇచ్చింది. ఇప్పటికే సర్వీసులో ఉన్న ప్రభుత్వ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్న వినతిని NCTE తిరస్కరించింది. 2017 పార్లమెంట్ తీర్మానం ప్రకారం ఈ తీర్పు ఇచ్చినందున.. అంతకుముందు నియమితులైన వారికి వర్తింపచేయరాదని టీచర్లు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలిని ఆశ్రయించారు. అయితే సుప్రీం తీర్పు నేపథ్యంలో NCTE వారి అభ్యర్థనను తిరస్కరించింది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది ఉపాధ్యాయులు తమ భవిష్యత్ గురించి […]

న్యూయార్క్ లోని గూగుల్ ఆఫీస్ క్లోజ్ ఎందుకంటే ?

గూగుల్ ఆఫీస్ మన్‌హాటన్‌లో తాత్కాలికంగా మూతపడిన నేపథ్యంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ సూచన న్యూయార్క్‌లోని మన్‌హాటన చెల్సియా క్యాంపస్‌లో గూగుల్ ఆఫీస్ తాత్కాలికంగా మూతపడింది. ఆఫీసులో ఏర్పడిన నల్లుల సమస్యను ఎదుర్కోవడానికి కంపెనీ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేయాలని సూచించింది. ఈ నెల 19న ఆఫీసు మూతపడినప్పటి నుంచి, నల్లుల సమస్య పరిష్కారం అయ్యే వరకు ఉద్యోగులు కార్యాలయానికి రాకూడదని గూగుల్ పేర్కొంది. మన్‌హాటన్ గూగుల్ ఆఫీస్‌లో ప్రస్తుతం నల్లుల నివారణ చర్యలు చేపట్టబడుతున్నాయి.

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సిగ్గుందా- కేటీఆర్

మా ఎమ్మెల్యే మీ స్టార్ క్యాంపెయినరా?: కాంగ్రెస్‌పై కేటీఆర్ సీరియస్ వ్యాఖ్యలు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితా చుట్టూ వివాదం చెలరేగింది. ఆ జాబితాలో బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరును చేర్చడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. “కాంగ్రెస్ పార్టీకి నీతి, రీతి ఉన్నాయా? మా ఎమ్మెల్యే పేరుని తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఎలా చేర్చగలరు?” అని ఆయన […]

పూణేలోని కోట వద్ద ముస్లిం మహిళల నమాజ్.. గోమూత్రంతో శుద్ధి చేసిన బీజేపీ ఎంపీ

చారిత్రక ప్రాధాన్యత కలిగిన పూణేలోని శనివార్ వాడ కోట ప్రాంగణంలో కొందరు ముస్లిం మహిళలు నమాజ్‌ చేస్తూ కనిపించిన వీడియో క్లిప్‌, మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపింది, బీజేపీ ఎంపీ మేధా కులకర్ణి నేతృత్వంలోని హిందూ సంస్థల బృందం, ఆ ప్రదేశాన్ని ‘శుద్ధి’ చేసేందుకు ప్రయత్నించడంతో వివాదం మరింత రాజుకుంది. శనివార్ వాడ కోట హిందూ సమాజానికి పవిత్రమైనదని, ప్రార్థనలు చేయాలంటే మసీదులకు వెళ్లాలని సూచించారు.

తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం అసంభవం.. బాంబు పేల్చిన ఖర్గే

తెలంగాణలో కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి రావడం అసంభవం.. రేవంత్‌ రెడ్డికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే సర్వనాశనం చేసిండు స్వయంగా కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పిన మాటలు సౌత్‌ ఫస్ట్‌ ఎడిటర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రేవంత్ రెడ్డి గ్యారెంటీల అమలులో ఘోరంగా విఫలం అయ్యాడని. పరిపాలన గాడి తప్పిందని ప్రజలు అనుకుంటున్నారని. బీసీ రిజర్వేషన్ అంశాన్ని రేవంత్ సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల మన పరిస్థితి రెండిటికి చెడ్డ రేవడి అయ్యిందని కాంగ్రెస్‌ […]

భీమవరం డీఎస్పీపై పవన్ సీరియస్..

భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై పశ్చిమ గోదావరి ఎస్పీతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చించారు. డీఎస్పీ జయసూర్యపై పవన్ కళ్యాణ్‌కు తరచూ ఫిర్యాదులు వెళ్లాయి. పేకాట శిబిరాలు పెరిగిపోయాయని, సివిల్ వివాదాలలో జయసూర్య జోక్యం చేసుకొంటున్నారని, కొందరి పక్షం వహిస్తూ కూటమి నేతల పేరు వాడుతున్నట్లు పవన్‌కు ఫిర్యాదులు వచ్చాయి. అసాంఘిక వ్యవహారాలకు డీఎస్పీ స్థాయి అధికారి అండగా ఉండటాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు. పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చకుండా చూడాలని ఎస్పీకి ఉపముఖ్యమంత్రి సూచించారు.

ఆయనకు చదువుంది.. బుద్ధి, జ్ఞానం లేదు: జేసీ ప్రభాకర్ రెడ్డి

తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై స్థానిక మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏఎస్పీ రోహిత్ కుమార్‌ అనుసరిస్తున్న వైఖరిపై జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ఆయన ఎప్పుడూ పోలీస్ డ్రెస్‌లో కనిపించలేదంటూ ఈ ఏఎస్పీకి చదువు మాత్రమే ఉందని.. బుద్ధి, జ్ఞానం, తెలివి సైతం లేవన్నారు. ఈ ఉద్యోగానికి రోహిత్ కుమార్ చౌదరి అనర్హుడని స్పష్టం చేశారు. ఎక్కడైనా ఘర్షణలు జరిగి రాళ్లు రువ్వుకుంటే ఈ ఏఎస్పీ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON