loader

గ్రూప్-2 ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం

గ్రూప్-2 పరీక్షలో విజేతలకు ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యార్థి, నిరుద్యోగ యువత ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్న సీఎం.. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో పదేళ్లు అధికారం చెలాయించిన వాళ్లు ఒక్కక్షణం కూడా నిరుద్యోగుల గురించి ఆలోచన చేయలేదని విమర్శించారు. ఇప్పటి వరకు మీరు సామాన్యులు.. ఈ రోజు నుంచి మీరు ఆఫీసర్స్. మీ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించి ఆదర్శంగా నిలవాలి.’ అని కొత్తగా ఉద్యోగాల్లో నియమితులైన వారిని […]

ఈ సారి భిన్నంగా మూరత్‌ ట్రేడింగ్‌..! దీపావళి స్పెషల్‌ ట్రేడింగ్‌

సాధారణంగా దీపావళి రోజున జరిగే స్టాక్ మార్కెట్ మూరత్‌ ట్రేడింగ్ సెషన్ ఈ ఏడాది మధ్యాహ్నం జరుగనున్నది. ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సర్క్యులర్‌ జారీ చేశాయి. సర్క్యులర్ ప్రకారం.. ప్రతి సంవత్సరం మూరత్‌ ట్రేడింగ్ సాయంత్రం జరిగేది. కానీ, ఈ సారి మాత్రం దీపావళి మూరత్‌ ట్రేడింగ్‌ ఈ నెల 21న మధ్యాహ్నం 1.45గంటల నుంచి 2.45 గంటల వరకు జరుగుతుందని సర్క్యూలర్‌లో ఎన్‌ఎస్‌ఈ పేర్కొంది.

విమానం గాల్లో ఉండగానే మంటలు.. చూస్తుండగానే..

చైనాకు చెందిన ఎయిర్ చైనా విమానం సీఎ139 శుక్రవారం హాంగ్‌చౌ నుంచి సియోల్ బయలు దేరింది. ఈ నేపథ్యంలోనే విమానం క్యాబిన్‌లోని ఓవర్ హెడ్ కంపార్ట్‌మెంట్‌లో లిథియమ్ బ్యాటరీ పేలింది. దీంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో విమానంలో ఉన్న వారంత భయంతో అరుపులు, కేకలు పెట్టారు. సకాలంలో స్పందించిన సిబ్బంది మంటల్ని ఆర్పారు. వెంటనే సిబ్బంది విమానం షాంగైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. కానీ విమానంలో ఉన్న వారంత తెగ టెన్షన్ కు గురయ్యారు. లక్ […]

ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం..8మంది మృతి

మహారాష్ట్రలోని చాంద్‌షాలి ఘాట్‌ వద్ద భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అస్తంబా దేవీ యాత్ర ముగించుకొని తిరిగి వస్తున్న భక్తుల పికప్ వ్యాను ఘాట్ రోడ్డులోని మలుపు వద్ద అదుపు తప్పి లోయలో పడిపోయింది. ప్రమాదం అంత భయంకరంగా ఉండటంతో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. సాక్షుల ప్రకారం, వ్యాను అధిక వేగంతో వెళ్తుండగా డ్రైవర్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోవడంతో వాహనం లోయలోకి దూసుకుపోయిందని చెబుతున్నారు. ప్రమాద స్థలంలోనే 8మంది భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 8మందికి […]

టపాసుల గోదాంలో అగ్ని ప్రమాదం

సంగారెడ్డి జిల్లా, ఆందోల్ శివారులోని కటుకం వేణుగోపాల్ & సన్స్ టపాసుల గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. గుర్తు తెలియని వ్యక్తి అగ్గి రాజేయడంతో మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. విక్రయదారులకు తృటిలో పెనుప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది.బాణాసంచా గోదాం యాజమాన్యం ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని తెలుస్తోంది.

అమీన్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలు..సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పిఠాధిపతి హజ్రత్ కేఎస్ఎస్ ఆరిఫుల్లా హుస్సేనీ ఆహ్వానం అందించారు. జాతీయ స్థాయిలో పేరొందిన ఈ ఉర్సు మహోత్సవాలు నవంబర్ 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరుగుతున్నాయని… ఈ ఉర్సు మహోత్సవాలకు తప్పనిసరిగా హజరుకావాలని ముఖ్యమంత్రిని కోరారు. ఉర్సు మహోత్సవ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయని సీఎం వారిని అడిగి తెలుసుకున్నారు. ఉర్సు మహోత్సవాలకు సహకారం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ఆర్‌ఎస్‌ఎస్ మార్చ్‌కు హాజరైన పంచాయతీ అధికారి సస్పెండ్

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)నిర్వహించిన మార్చ్‌లో పాల్గొన్న అధికారిపై సస్పెన్షన్‌ వేటు పడింది. కర్నాటకలోని రాయ్‌చూర్ జిల్లాలోగల సిర్వార్ తాలూకాలో ప్రభుత్వ అధికారిగా పనిచేస్తున్న కేపీ ప్రవీణ్ కుమార్‌ను గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ (ఆర్‌డీపీఆర్) విభాగం సస్పెండ్ చేసింది. ఆయన లింగ్‌సుగూర్‌లో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది రూట్ మార్చ్‌లో ఆ సంస్థ యూనిఫారం ధరించి పాల్గొన్నారు. ఫలితంగా ఆయన సస్పెన్షన్‌కు గురయ్యారు.

పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్యకు కేటీఆర్ అండ

ఇంటి స్థల సమస్య, ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. ఈరోజు కేటీఆర్‌ను మొగులయ్య కలిశారు. ఈ సందర్భంగా తన సమస్యను మాజీ మంత్రికి వివరించారు మొగులయ్య. తాను కట్టుకున్న ఇంటి గోడలను కబ్జాదారులు కూల్చి వేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మొగులయ్య ఆరోగ్యం, యోగక్షేమాల గురించి కేటీఆర్ ఆరా తీశారు. కంటి చికిత్స చేయిస్తానంటూ హామీ ఇచ్చారు.

ఢిల్లీలో ఎంపీల నివాస సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం

ఢిల్లీలోని బిషంబర్‌ దాస్‌ మార్గ్‌ లోని బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌లో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్‌ సభ్యులకు కేటాయించిన ఫ్లాట్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందగానే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మూడో అంతస్తులో ఒకరికి కాలిన గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

నల్గొండలో ఉద్రిక్తత.. కార్ల షోరూమ్‌పై బీజేపీ కార్యకర్తల దాడి

నల్గొండలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చర్లపల్లిలో ఉన్న పవన్‌ నెక్సా మోటార్స్‌ కార్ల షోరూంపై బీజేపీ కార్యకర్తల దాడి చేశారు. అద్దాలు ధ్వంసం చేశారు. బంద్‌ చేయకుండా షోరూం ఓపెన్ చేశారంటూ ఆగ్రహంతో బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోదరుడి షోరూమ్‌గా గుర్తించారు. బంద్ చేయకుండా షోరూం తెరవడంతో బీజేపీ, సిబ్బందికి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో బీజేపీ కార్యకర్తలు ఆగ్రహంతో రాళ్లతో‌ దాడి చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON