loader

రాహుల్‌పై అరుపులు మాని నిజాలు తేల్చండి: మాజీ సిఇసి ఖురేషీ

రాహుల్ గాంధీపై పదేపదే అరవడం కంటే ఎన్నికల సంఘం ఓటు చోరీపై దర్యాప్తునకు దిగడం మంచిదని ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి ఎస్‌వై ఖురేషీ చెప్పారు. దేశంలో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ప్రతిపక్ష నేత రాహుల్ చెపుతున్నారు. ఎన్నికల సంఘం వీటికి సరైన సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. దీనికి బదులుగా ఆయనపై అభ్యంతరకర రీతిలో దురుసుగా మాట్లాడటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్ష నేత ఆరోపణలపై సరైన రీతిలో దర్యాప్తు జరిపితే […]

హైదరాబాద్‌లో మరో విషాదం..నాలాలో పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతు!

హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు నగరం మొత్తం తడిసి ముద్దైంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో నాలాలు పొంగి ప్రవహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆసిఫ్‌ నగర్‌లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. అప్జల్‌ సాగర్‌ కాలువలో పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే, పోలీసులు, అధికారులకు సమాచారం అందించారు. సగల్లంతైన వ్యక్తులు ఒకే కుటుంబానికి చెందిన మామ, అల్లుడిగా గుర్తించారు.

గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం.. గోడకూలి ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు!

హైదరాబాద్‌లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. నగరంలో గత సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో గచ్చిబౌలిలోని వట్టినాగుల పల్లిలో గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఒకరు కార్మికులు మృతి చెందగా, మరో నలుగురు కార్మికులు గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వారికి వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం వారు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. నగరంలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఈ కారణంగా లోతట్టు ప్రాంతాలన్ని జలమయంగా మారాయి

భారత్ దెబ్బకు కుప్పకూలిన పాకిస్తాన్.. టార్గెట్ ఎంతంటే?

భారత్, పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ పోరు జరిగింది. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు. రెండు మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. పిచ్ నెమ్మదిగా ఉండడంతో స్పిన్‌కు అనుకూలించింది. దీంతో భారత్ పాక్ ను 127/9 పరుగులకే పరిమితం చేసింది. భారత్ బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ 3/18తో మెరిశారు. అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు. బుమ్రా, పాండ్యా తలా ఒక్కో వికెట్ సాధించారు. వరుణ్ చక్రవర్తి కూడా […]

ఐటీఆర్ దాఖలు చేసే పోర్టల్ పదే పదే క్రాష్. ప్రభుత్వం గడువును పొడిగిస్తుందా?

ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి చివరి తేదీ ఇప్పుడు కొన్ని గంటల దూరంలో ఉంది. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం గతంలో జూలై 31 గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. కానీ సమయం ముగియడంతో పన్ను చెల్లింపుదారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్థిక నిపుణులు సోషల్ మీడియాలో తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఆదాయపు పన్ను పోర్టల్ చాలా నెమ్మదిగా నడుస్తోందని, తప్పులు పదే పదే వస్తున్నాయని, కొన్నిసార్లు లాగిన్ సాధ్యం కాదని […]

కాంగ్రెస్ వల్లే విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి – హరీశ్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడం సిగ్గుచేటని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అనేక విద్యాసంస్థలు మూసివేసే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఉద్యోగుల జీతాలు చెల్లించడంలో విఫలమైన ప్రభుత్వం, కోట్లాది రూపాయల ప్రాజెక్టులకు టెండర్లు ఎలా పిలుస్తుందని ఆయన ప్రశ్నించారు. ఈ విధానం వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోందని ఆయన […]

అలాయ్ బలాయ్‌.. సిఎం రేవంత్ రెడ్డికి దత్తన్న ఆహ్వానం

వచ్చే నెల మూడో తేదీన నిర్వహించతలపెట్టిన అలాయ్ బలాయ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆహ్వానించారు. ఆదివారం మర్యాదపూర్వకంగా సిఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి కలుసుకుని ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యధావిధిగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు దత్తాత్రేయ ముఖ్యమంత్రికి వివరించారు.

ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్

ఆసియాకప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. హార్థిక్ పాండ్యా వేసిన  బంతికి జట్టు ఓపెనర్ సైమ్ అయూబ్(0) బుమ్రాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత బుమ్రా వేసిన రెండో ఓవర్‌లో మహ్మద్ హారిక్(3) హార్థిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 2 ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ 2 వికెట్ల నష్టానికి 7 పరుగులు చేసింది. క్రీజ్‌లో సాహిబ్జాదా […]

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో స్వర్ణం

ప్రపంచబాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో స్వర్ణ పతాకం లభించింది. 48 కిలోల విభాగంలో మీనాక్షి హుడా బంగారు పతకం సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కజికిస్థాన్‌కు చెందిన నాజిమ్ కైజైబేపై 4-1 స్ల్పిట్ డెషిషన్‌తో మీనాక్షి విజయం సాధించింది. కాగా, పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతాకం సాధించిన నాజిమ్‌కి భారత బాక్సర్ మీనాక్షి గట్టి పోటీ ఇచ్చింది. తొలి రౌండ్లో ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించింది. దీంతో తొలి రౌండ్‌ను 4-1తో సొంతం చేసుకుంది.

హిందీని అన్ని రంగాల్లో ప్రోత్సహించాలి: అమిత్ షా

హిందీ దివస్ సందర్భంగా జరిగిన అఖిల భారత అధికార భాషా సమ్మేళనంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా హిందీ భాష ప్రాధాన్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీని కేవలం సంభాషణలు, అధికారిక వ్యవహారాలకు మాత్రమే పరిమితం చేయకుండా, సైన్స్, టెక్నాలజీ, న్యాయం, పోలీసు శాఖ వంటి రంగాలలో కూడా ప్రాముఖ్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. హిందీ ఇతర భారతీయ భాషలతో  కలిసి నడవాల్సిన అవసరం ఉందని అమిత్ షా స్పష్టం చేశారు.”భాషల మధ్య ఐక్యతే దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది” […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON