హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలకు నగరం మొత్తం తడిసి ముద్దైంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో నాలాలు పొంగి ప్రవహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆసిఫ్ నగర్లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. అప్జల్ సాగర్ కాలువలో పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే, పోలీసులు, అధికారులకు సమాచారం అందించారు. సగల్లంతైన వ్యక్తులు ఒకే కుటుంబానికి చెందిన మామ, అల్లుడిగా గుర్తించారు.

