loader

జులై 1, 2 తేదీల్లో డీఎస్సీ పరీక్షకు కొత్త హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోండి

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు అప్డేట్ వచ్చింది. జూలై 1, 2 తేదీల్లో పరీక్షలు రాసే డీఎస్సీ అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని ఏపీ విద్యాశాఖ సూచించింది. ఈ పరీక్షలు రాసే డీఎస్సీ అభ్యర్థులు ఏపీ డీఎస్సీ. ఏపీసిఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ వెబ్సైట్లో apdsc.apcfss.in హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని కొత్త హాల్టికెట్లలో పరీక్షా కేంద్రాలు నిర్ధారించుకుని ఎగ్జామ్స్ కు హాజరుకావాలని సూచించారు.దాని ప్రకారం పరీక్షలకు హాజరు కావాల్సిందని కోరారు.

మధుసూధనా చారి, బాల్క సుమన్‌పై కేసు నమోదు

పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి, మాజీ ఎంపి బాల్కసుమన్‌తో సహ పలువురిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. ఓ మీడియా చానల్‌పై దాడి చేశారంటూ బిఆర్‌ఎస్ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై ఆరోపణలు రావడంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు తెలంగాణ భవన్‌కు వెళ్లారు. తెలంగాణ భవన్‌లోకి వెళ్లకుండా పోలీసులను అడ్డుకున్నారని మధుసూధనాచారి, బాల్కసుమన్‌తో సహా మరికొందరిపై బంజారా హిల్స్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.

ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్.!

టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. సుమారుగా 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి గైర్హాజరు అయినట్లు సమాచారం. దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి డుమ్మా కొట్టి.. విదేళాల్లో ఎమ్మెల్యేలు ఉండటంపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉండటం సరికాదని వార్నింగ్ ఇచ్చారు. పార్టీ సమావేశానికి ఆహ్వానించిన వారిలో 56మంది గైర్హాజరు కావటంపైనా చంద్రబాబు అసహనం వ్యక్తంచేశారు.

యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు..

టివి న్యూస్ రీడర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో అరెస్టైన పూర్ణ చందర్ నాయక్‌కు కోర్టు ఆదివారం 14 రోజుల రిమాండ్ విధించింది. స్వేచ్ఛ కూతురు కూడా తన పట్ల పూర్ణచందర్ అసభ్యంగా ప్రవర్తించాడని చిక్కడ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై పోక్సో యాక్ట్, బిఎన్‌ఎస్ యాక్ట్ 69,108 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కాంగ్రెస్ కోసమో.. రేవంత్ కోసమో పని చేయదు:కిషన్‌రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అవగాన రాహిత్యంతో మాట్లాడుతున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కోసమో, రేవంత్‌రెడ్డి కోసమో పని చేయదని, తెలంగాణ ప్రజల కోసమే పని చేస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. అభివృద్ధి అంటే ఏమిటో ప్రధాని మోడీని చూసి తెలుసుకోవాలంటూ రేవంత్‌రెడ్డికి చురకలు వేశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, నువ్వు సిద్ధమా అని రేవంత్ రెడ్డికి […]

పెళ్లి చేసుకున్న మాజీ ఎమ్మెల్యే- సస్పెండ్ చేసిన బీజేపీ

నటి ఊర్మిళ సనావర్‌ను వివాహం చేసుకున్న ఉత్తరాఖండ్‌ జ్వాలాపూర్ మాజీ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్‌ను ఆరు సంవత్సరాల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది. ఉత్తరాఖండ్‌లో ఇటీవల అమలులోకి వచ్చిన యూనిఫాం సివిల్ కోడ్ (UCC) నిబంధనలను ఉల్లంఘించి, రెండో పెళ్లి చేసుకున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. UCC ప్రకారం, మొదటి భార్య లేదా భర్తతో చట్టబద్ధంగా వివాహం చెల్లుబాటులో ఉన్న సమయంలో రెండో పెళ్లి చేసుకోవడం నేరంగా పరిగణిస్తారు.

ఢిల్లీలో తెలంగాణ బోనాలు..మ‌హంకాళి ఆల‌య క‌మిటీ

అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన రాష్ట్ర బోనాల ఉత్సవాలను దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా నిర్వహించనున్నామని లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ తెలిపారు. ఢిల్లీలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కమిటీ సభ్యులతో కలిసి ఢిల్లీ బయలుదేరివెళ్లారు. సింహావాహిని ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం నుండి లాల్ దర్వాజా మోడ్ వరకు ఊరేగింపు నిర్వహించారు.

వివాహం కోసం అమెరికాకు వెళ్లిన భారతీయ యువతి అదృశ్యం

వివాహం కోసం అమెరికాకు వచ్చిన 24 ఏళ్ల భారతీయ యువతి అదృశ్యమైంది. ఆమె పేరు సిమ్రాన్, అమెకు ఇంగ్లీషు భాష తెలియదు. బంధువులు కూడా ఎవరు వెంటలేరు. అమెరికా లో కూడా ఆమెకు తెలిసిన బంధువులు ఎవరూ లేరని తెలిసింది. జూన్ 20న భారతదేశం నుంచి న్యూజెర్సీకి చేరిన కొద్ది సేపటికే సిమ్రాన్ చివరిసారిగా కన్పించారు. సిమ్రాన్ న్యూజెర్సీకి వచ్చిన ఐదు రోజుల తర్వాత బుధవారంనాడు కనిపించకుండా పోయిందని పోలీసులు నిర్థారించారు. ఆమె కుదిర్చిన వివాహంకోసం అమెరికా […]

వైద్య విద్యార్థులకు స్టైఫండ్‌ 15% పెంచిన ప్రభుత్వం

తెలంగాణలో వైద్య విద్యార్థులకు శుభవార్త. మెడికల్, డెంటల్ స్టూడెంట్స్‌కి ప్రభుత్వం 15 శాతం స్టైఫండ్ పెంపు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల గౌరవ వేతనాన్ని కూడా పెంచింది. తాజా పెంపుతో ఇంటర్న్‌లకు నెలకు రూ.29,792 స్టైఫండ్ అందనుంది. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో హౌజ్ సర్జన్లు, పీజీ విద్యార్థులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వం చెల్లించాల్సిన స్టైఫండ్‌ను కాలేజీ యాజమాన్యాలు దారుణంగా మాయం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. శనివారం నల్ల బ్యాడ్జీలు ధరించి […]

హిందీ తప్పనిసరి నిర్ణయం రద్దు- ఫడ్నవీస్ సర్కార్

మహారాష్ట్రలో హిందీ భాషను తప్పనిసరి చేయాలనే నిర్ణయాన్ని ప్రస్తుతానికి నిలిపివేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం ఈ మేరకు ప్రకటన చేశారు. శివసేన (ఉద్ధవ్ థాకరే), రాజ్ థాకరే పార్టీ ఎంఎన్ఎస్ జూలై 5న ఒకటవ తరగతి నుంచి హిందీని తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. ఇంతలో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తదుపరి […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON