తెలంగాణలో వైద్య విద్యార్థులకు శుభవార్త. మెడికల్, డెంటల్ స్టూడెంట్స్‌కి ప్రభుత్వం 15 శాతం స్టైఫండ్ పెంపు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల గౌరవ వేతనాన్ని కూడా పెంచింది. తాజా పెంపుతో ఇంటర్న్‌లకు నెలకు రూ.29,792 స్టైఫండ్ అందనుంది. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో హౌజ్ సర్జన్లు, పీజీ విద్యార్థులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వం చెల్లించాల్సిన స్టైఫండ్‌ను కాలేజీ యాజమాన్యాలు దారుణంగా మాయం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. శనివారం నల్ల బ్యాడ్జీలు ధరించి వారు నిరసన తెలిపారు.

