loader

51 బంతుల్లోనే తొలి టీ20ఐ సెంచరీ.. తొలి ప్లేయర్‌గా రికార్డ్

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి T20 అంతర్జాతీయ మ్యాచ్‌లో స్మృతి మంధానా 51 బంతుల్లో సెంచరీ సాధించి చరిత్ర సృష్టించింది. మూడు ఫార్మాట్లలోనూ (టెస్టు, వన్డే, T20I) సెంచరీలు చేసిన తొలి భారతీయ మహిళా క్రికెటర్‌గా నిలిచింది. కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ, 112 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. ఈ విజయవంతమైన ఇన్నింగ్స్‌తో భారత జట్టు 210 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక T20I స్కోరు కూడా ఇదే.

తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం

తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు త్రుటిలో ప్రమాదం తప్పిపోయింది. ఆయన ప్రయాణిస్తున్న కారు టైరు ఒక్కసారిగా ఊడిపోయింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కారు స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, అదృష్టవశాత్తూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు ఏం కాలేదు. ప్రమాదం నుంచి బయటపడిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మరో కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ప్రధాని మోడీకి ‘ ధర్మచక్రవర్తి’ బిరుదు

జైన సాధు మహారాజు జయంతి విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన సభ నేపథ్యంలోనే జైన అత్యున్నత మండలి ప్రధాని మోడీకి ధర్మ చక్రవర్తి పురస్కారం అందించారు. ధర్మనిబద్ధతత పాటించే పాలకులకు , ధర్మ పరిరక్షణ సంకల్పం కల్గిన వారికి ఈ బిరుదు ప్రసాదించడం జరుగుతుంది. ఈ విశిష్ట పురస్కారానికి తాను అర్హుడినని తాను భావించడం లేదని, అయితే సాధువులు బహుకరించే వాటిని దివ్య ప్రసాదంగా స్వీకరించడం భారతీయ సంస్కృతి, ఈ క్రమంలోనే ఈ గౌరవాన్ని తాను ప్రసాదంగా తీసుకుంటున్నానని తెలిపారు.

ఆరోగ్యశాఖలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో మరోసారి ఉద్యోగాలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. ఈ మేరకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మల్టీ జోనల్ 1లో 379 పోస్టులు, మల్టీ జోనల్ 2లో 228 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ జరగనుంది. జులై 10వ తేదీ నుంచి జులై 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అధికారిక వెబ్‌సైట్ https://mhsrb.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

తెలంగాణకు ఇందిరా గాంధీ ఇవన్నీ ఇచ్చారు.. మోదీ ఏమిచ్చారు?

పీజేఆర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వాలు హైదరాబాద్‌కు ఎన్నో ప్రాజెక్టులు తెచ్చాయని, మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. మెట్రో విస్తరణ, మూసీ రివర్ ఫ్రంట్ వంటి వాటికి నిధులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు రాలేదని, అమిత్ షాను కలిసి మరోసారి విజ్ఞప్తి చేస్తానని తెలిపారు. ఈ ఫ్లైఓవర్ గచ్చిబౌలిలో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది.

వంశీ బెయిల్‌‌పై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం

వైసీపీ నేత వల్లభనేని వంశీకి మట్టి అక్రమ తవ్వకాలకేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఇచ్చిన బెయిల్‌పై సుప్రీంకోర్ట్‌కు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్ట్‌లో ఉన్న అడ్వకేట్ ఆన్ రికార్డ్స్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇంతటి భారీ నష్టం కలిగిన కేసులో హైకోర్ట్ బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్ట్ వంశీ‌కి ఇచ్చిన బెయిల్‌ని రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్ట్‌లో సోమవారం స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేయనుంది.

బంగ్లాదేశ్‌‌కు బిగ్ షాకిచ్చిన మోదీ సర్కార్..

బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులపై దాడులను పట్టించుకోకపోవడంపై ఆ దేశంపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా బంగ్లాదేశ్ నుంచి దుస్తులు, జనపనార దిగుమతులపై భారత్ ఆంక్షలు విధించింది. జనపనార దిగుమతులను ముంబైలోని నవా షెవా ఓడరేవు ద్వారా మాత్రమే అనుమతిస్తామని తేల్చి చెప్పింది. ఇతర భూ మార్గాలు లేదా సముద్ర మార్గాల ద్వారా అనుమతించబోమని స్పష్టం చేసింది.

‘అన్నపూర్ణ’ క్యాంటీన్ పేరు మార్పు.. కేటీఆర్ ఫైర్

గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.5 భోజనం పథకం అన్నపూర్ణ క్యాంటీన్ల పేరును ‘ఇందిరా క్యాంటీన్’గా మార్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్రంగా స్పందించారు. మార్చడం హాస్యాస్పదం, సిగ్గుచేటు అని కేటీఆర్ మండిపడ్డారు. దిల్లీ పెద్దల ముందు మంచి మార్కులు కొట్టేయడానికి ఇలా చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. అంత అవసరం ఉంటే మీ పేరు మార్చుకోవచ్చు కదా, రేవంత్ రెడ్డి తన పేరును మార్చుకుని ‘రాజీవ్’ లేదా ‘జవహర్’ అని పెట్టుకుంటే బాగుంటుందని కేటీఆర్ […]

శుభాన్షు శుక్లాతో మాట్లాడిన ప్రధాని మోదీ

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో భారత వైమానిక దళ అధికారి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యక్ష సంభాషణ నిర్వహించారు. ఈ సంభాషణ భారతదేశ అంతరిక్ష చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడమే కాకుండా, భారతదేశ శాస్త్రీయ సామర్థ్యాన్ని, ప్రపంచ అంతరిక్ష పరిశోధనలో దాని బలమైన భాగస్వామ్యాన్ని సూచిస్తుంది. శుభాన్షు శుక్లాతో వీడియో కాల్ ద్వారా మాట్లాడిన ప్రధానమంత్రి మోదీ ఆయన ధైర్యాన్ని, సహకారాన్ని ప్రశంసించారు.

యాంకర్ స్వేచ్ఛ మృతిపై తల్లిదండ్రుల ఫిర్యాదు

న్యూస్ యాంకర్ స్వేచ్ఛ మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్ణచందర్ అనే వ్యక్తి కారణంగానే తన బిడ్డ ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ చిక్కడపల్లి పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. స్వేచ్ఛకు భర్తతో విడాకులు తరువాత పూర్ణచందర్ స్వేచ్ఛను ప్రేమిస్తున్నానంటూ మూడుళ్లపాటు వెంటపడ్డాడు. తన భార్యతో విభేదాలున్నాయని, స్వేచ్చ ఒప్పుకుంటే భార్యకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. పూర్ణచందర్ మాటలను నమ్మిన స్వేఛ్చ దగ్గరైయ్యింది. అలా నాలుగేళ్ల నుండి వీరి పరిచయం కొనసాగుతూ వస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON