loader

AXIOM-4 మిషన్ ప్రయోగం జూన్ 11కి వాయిదా

భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా ముగ్గురిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లే ఆక్సియం-4 మిషన్ ప్రయోగం మళ్లీ వాయిదా పడింది. వాతావరణ పరిస్థితులు సరిగా లేవని జూన్‌10 జరగాల్సిన ప్రయోగం వాయిదా పడింది. ఒకరోజు ఆలస్యంగా జూన్ 11న నిర్వహించబోతున్నట్టు ఇస్రో ప్రకటించింది.

అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య

రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలం, ధర్మారం గ్రామానికి చెందిన అన్నవేణి తిరుపతి (36) అనే యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతో ఈ నెల 5న క్రిమి సంహారక మందు తాగడంతో కుటుంబసభ్యులు అతనిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస వదిలాడు. మృతునికి తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఏపీలో ఎస్జీటీలకు మాన్యువల్‌గా ట్రాన్స్‌ఫర్‌ కౌన్సెలింగ్

ఆంధ్రప్రదేశ్‌లో ఎస్జీటీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పంది. వారికి మాన్యువల్‌గా కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అంగీకరించింది. పార్వతీపురం మన్యం జిల్లాలో నా క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం ప్రజాప్రతినిధులు, టిడిపి ఎమ్మెల్సీల తో ఎస్జీటీ కౌన్సెలింగ్‌పై చర్చించాం. ఉపాధ్యాయుల అభిప్రాయాలను ఎమ్మెల్సీలు నాకు తెలియజేశారు. వారి విజ్ఞప్తి మేరకు ఎస్జీటీలకు ఆన్‌లైన్ కౌన్సెలింగ్ బదులుగా మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించాం. అని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.

రోడ్డు ప్రమాదంలో 15 మంది విద్యార్థులు మృతి

ఉత్తర మలేసియాలో యూనివర్శిటీ విద్యార్థులను క్యాంపస్‌కు తీసుకెళ్తున్న బస్సు ఓ మినీ వ్యాన్‌ను ఢీకొట్టడంతో 15 మంది విద్యార్థులు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఉత్తరమలేసియా లోని సుల్తాన్ ఇద్రిస్ ఎడ్యుకేషనల్ యూనివర్శిటీకి చెందిన బస్సు విద్యార్థులతో వెళ్తుండగా, అదుపు తప్పి ముందు వెళ్తున్న మినీ వ్యాన్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో 13 మంది విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

అమెరికాలో భారతీయ విద్యార్థిపై అమానుషం

భారతీయ విద్యార్థి పట్ల అమెరికాలో అమానుషంగా ప్రవర్తించారు. విమానం దిగిన అతడ్ని ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ అధికారులు అడ్డుకున్నారు. నేలకేసి నొక్కిపెట్టి హింసించారు. చేతులకు సంకెళ్లు వేసి అదుపు లోకి తీసుకున్నారు. ఆ తర్వాత అమెరికా నుంచి బహిష్కరించారు. సోషల్ మీడియా యూజర్, సామాజిక వ్యవస్థాపకుడు, కునాల్ జైన్ ఈ దారుణం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

కన్నప్ప లో ఆ పేర్లపై కాంట్రవర్సీ

కన్నప్ప మూవీలో బ్రహ్మానందం, సప్తగిరి పోషించిన పాత్రల పేర్లు తమ మనోభావాలు దెబ్బతీశాయని.. ఆ పేర్లను తొలగించకుంటే.. రిలీజ్ అడ్డుకుంటామని బ్రాహ్మణ సంఘాలు వార్నింగ్ ఇచ్చాయి. ఇటీవల గుంటూరులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ ఆందోళన నిర్వహించారు. ‘కన్నప్ప’ మూవీలో పేర్ల వివాదంపై మంచు విష్ణు స్పందించారు. తాము ఎవరి మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశంతో సినిమా తీయలేదని.. రిలీజ్ కాకముందే ఓ నిర్ణయానికి రావొద్దంటూ విజ్ఞప్తి చేశారు.

వందే భారత్‌లో బర్త్‌ డే వేడుకలు..! మండిపడ్డ నెటిజన్లు

కశ్మీర్‌లోని మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో వారణాసి దంపతులు తమ కుమారుడు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. నేహా జైస్వాల్ కుటుంబం కేక్ మీద కొవ్వొత్తులను వెలిగిస్తూ కనిపిస్తుంది. “రైలు మీ పార్టీ హాల్ కాదు. లోపల కొవ్వొత్తులను వెలిగించడం సురక్షితం కాదు, ప్రాథమిక పౌర జ్ఞానం లేకపోవడాన్ని కూడా చూపిస్తుంది” అని “రైళ్ల లోపల అగ్గిపుల్ల వెలిగించడం నిషేధించబడిందని నేను అనుకున్నాను” అని నెటిజన్‌ కామెంట్స్ చేస్తున్నారు

26 కులాలను తిరిగి చేర్చడంపై బహిరంగ విచారణ ప్రారంభం

బిసి జాబితా నుండి తొలగించబడిన 26 కులాలను తిరిగి చేర్చుకోవడంపై రాష్ట్ర బిసి కమిషన్ బహిరంగ విచారణ ప్రారంభించింది. తొలిరోజు సోమవారం బిసి కమిషన్ కార్యాలయంలో 13ప్రతినిధుల బృందాలను బిసి కమిషన్ విచారించింది. మంగళ, బుధ వారాల్లో కూడా విచారణ కొనసాగుతుందని బిసి కమిషన్ పేర్కొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ బిసి కులాల జాబితా నుండి తొలగించబడిన 26 కులాలను తిరిగి చేర్చుకోవాలని వచ్చిన విజ్ఞప్తులపై బిసి కమిషన్ విచారణ చేపట్టింది.

భారత అంతరిక్ష సామర్థ్యాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు: జితేంద్రసింగ్

మంగళవారం జరిగే స్పేస్‌ ఎక్స్ (Space X) ప్రయోగంలో మరో ముగ్గురితో కలిసి భారత్‌కు చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షానికి పయనం అవుతున్న విషయం తెలిసిందే. దీంతో స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగం సందర్భంగా కేంద్రమంత్రి జితేంద్రసింగ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. భారత అంతరిక్ష సామర్థ్యాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించిందని ఆయన అన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఇస్రో-నాసా మిషన్ వెళ్లడంపై హర్షం వ్యక్తం చేశారు.

విద్యార్థిని హత్య ఘటన తీవ్రంగా కలచి వేసింది: లోకేష్

కూటమి ప్రభుత్వంలో ఉన్మాదులు, సైకోలకు తావులేదని ఎపి మంత్రి నారా లోకేష్ తెలిపారు. అనంతపురం విద్యార్థిని హత్య ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. ఈ ఘటనపై లోకేష్ స్పందించారు. దుండగులు రాక్షస ప్రవృత్తితో మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టడం తనను షాక్‌కు గురిచేసిందన్నారు. ఇంటర్ విద్యార్థిని హత్యకేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని లోకేష్ హామీ ఇచ్చారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON