ఉత్తర మలేసియాలో యూనివర్శిటీ విద్యార్థులను క్యాంపస్‌కు తీసుకెళ్తున్న బస్సు ఓ మినీ వ్యాన్‌ను ఢీకొట్టడంతో 15 మంది విద్యార్థులు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఉత్తరమలేసియా లోని సుల్తాన్ ఇద్రిస్ ఎడ్యుకేషనల్ యూనివర్శిటీకి చెందిన బస్సు విద్యార్థులతో వెళ్తుండగా, అదుపు తప్పి ముందు వెళ్తున్న మినీ వ్యాన్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో 13 మంది విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

