కరూర్ దుర్ఘటనపై ఈ నెల 19న టీవీకే నేత విజయ్మళ్ళీ సీబీఐ విచారణకు హాజరు కానున్నారు. సీబీఐ విచారణ కోసం ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన విజయ్.. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే వున్న విషయం తెలిసిందే. మంగళవారం కూడా సీబీఐ విచారణ జరగాల్సి ఉన్న పరిస్థితులలో విజయ్ తరఫు న్యాయవాదులు సంక్రాంతి కారణంగా విచారణను పండుగ తర్వాత విచారణ కొనసాగించాలని కోరారు. అందుకు అంగీకరించిన సీబీఐ అధికారులు.. ఈ నెల 19న రావాలని సమన్లు జారీ చేసినట్లు సమాచారం.

