ఆండ్రాయిడ్ వినియోగదారుల భద్రతపై Google ఫోకస్ చేసింది. ఈ క్రమంలో Play Storeపై చర్యలు మొదలుపెట్టింది. ప్లే స్టోర్ నుంచి ఏకంగా 17.5 లక్షల కంటే ఎక్కువ అనుమానాస్పద, Fake Appsను ప్లాట్‌ఫారమ్ నుంచి గూగుల్ తొలగించింది. దీంతో పాటు దాదాపు 80,000 డెవలపర్ అకౌంట్స్‌ను పర్మినెంట్‌గా బ్లాక్ చేసింది. గూగుల్ రిమూవ్ చేసిన మెజారిటీ యాప్‌లలో ప్రమాదకరమైన మాల్వేర్ ఉంది. యూజర్లకు సమాచారం లేకుండా పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌లను సైతం యాక్టివేట్ చేసే ఛాన్స్ ఉంది.

