
ఇటీవల గ్రూప్ 1 అధికారులుగా నియమితులైన వారిలో 131 మందిని 26 జిల్లాలకు మండలపరిషత్ డెవలె్‌పమెంట్ ఆఫీసర్స్(ఎంపీడీవో)గా నియమించారు. పంచాయతీరాజ్ శాఖలో వీరికి ఏడాది పాటు శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం వారికి అయా జిల్లాల్లోని మండలాల్లో ఎంపీడీవో పోస్టింగ్స్ ఇస్తారు. మరోవైపు మల్టీజోన్ రెండులో నలుగురు ఎంపీడీవోలను మల్టీజోన్ వన్‌లో మరో నలుగురిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈమేరకు పంచాయతీరాజ్ డైరెక్టర్ శ్రీజన ఉత్తర్వ్యులు జారీ చేశారు.