ఉత్తర జపాన్లోని ఇవాటే పర్వత ప్రాంతంలో గత 11 రోజులుగా మండుతున్న భారీ కార్చిచ్చు ఎట్టకేలకు నియంత్రణలోకి వచ్చింది. గత 30 ఏళ్లలో జపాన్లో సంభవించిన రెండో అతిపెద్ద అగ్నిప్రమాదంగా దీనిని పేర్కొంటున్నారు. ఈ మంటలను ఆర్పేందుకు వందలాది మంది అగ్నిమాపక సిబ్బందితో పాటు 1,000 మందికి పైగా సైనికులు శ్రమించారు. సుమారు 1,600 హెక్టార్ల (4,000 ఎకరాలు) అటవీ ప్రాంతం ఈ అగ్నికి ఆహుతైంది.
ఈ విస్తీర్ణం న్యూయార్క్ సిటీలోని సెంట్రల్ పార్క్ కంటే ఐదు రెట్లు పెద్దది కావడం గమనార్హం.

