ఒక్కో సీజన్‌లో ఒక్కో సాగు చేసే రైతులకు చిక్కులు, ఆర్ధిక నష్టాలు తప్పడం లేదు. చిత్తూరు జిల్లాలో మార్కెట్లో కిలో బంతి పూలు కేవలం రూ.1 కి పడిపోయింది. జిల్లాల్లో ఎకరాల్లో సాగు చేసి, పెట్టిన పెట్టుబడి లేక రైతన్నలు విల విలాడుతున్నారు. ప్రస్తుతం వీకోట మార్కెట్లో పూలు కొనే నాథుడు కరువైనాడు. దిక్కుతోచక రైతన్నలు తోటల్లో పూలు వధులు కొక పూసిన పూలు కోసి జాతీయ రహదారి పక్కన లిఫ్టులో పడేసిపోతున్నారు. కొంత మంది రైతన్నలు గొర్రెలు, పశువులకు మేతగా వేస్తున్నారు.

