లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను పదవి నుంచి తొలగించాలంటూ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు కాంగ్రెస్ ఎంపీలు నోటీసులు అందించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 94-C కింద అవిశ్వాస తీర్మానం నోటీసును అందజేసినట్లు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తెలిపారు. కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ తదితర పార్టీలకు చెందిన 120 మంది ఎంపీలు నోటీసులపై సంతకాలు చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి.

