మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్ మ్యాచ్ ఆలస్యంగా ఆరంభం కానుంది. వర్షం కారణంగా టాస్ వాయిదా పడింది. ప్రస్తుతం వాన ఆగినా చిత్తడి అవుట్ ఫీల్డ్ కారణంగా టాస్‌ను అంపైర్లు వాయిదా వేశారు. గ్రౌండ్‌లో పలు ప్రాంతాలు చిత్తడిగా మారాయి. గత రెండు రోజులుగా నవీ ముంబైలో వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కురవడంతో టాస్ ఆలస్యం కానుంది. మ్యాచ్ కూడా ఆలస్యంగా ఆరంభం కానుంది. వర్షం మళ్లీ రావడంతో టాస్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

