ఫ్రెంచ్ సైక్లిస్ట్, టిక్‌టాక్ స్టార్ అరోలియాన్ ఫాంటోనోయ్ మామూలోడు కాదు… సైకిల్‌పై ఏకంగా ఈఫిల్ టవర్ ఎక్కి అరుదైన రికార్డు సృష్టించాడు. ఎక్కడా ఆపకుండా, కాళ్లు నేలపై పెట్టకుండా ఏకంగా 686 మెట్లను కేవలం 12 నిమిషాల 30 సెకన్లలో ఎక్కి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇలాంటి ఫీట్స్ సాధించడం ఫాంటోనోయ్కు కొత్తేమీ కాదు. 2021లో ప్యారిస్‌లోని ట్రినిటీ టవర్, ఈ ఏడాది ఎస్టోనియాలోని టాలిన్ టీవీ టవర్‌ను సైకిల్‌పై అలవోకగా ఎక్కి ‘ఔరా’ అనిపించాడు.

