ప్రపంచ కప్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ టీమిండియా 23 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 224 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. వైభవ్ సూర్యవంశీ సెంచరీతో చెలరేగాడు. 72 బంతుల్లో పది సిక్స్‌లు, తొమ్మిది ఫోర్లతో 155 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. పట్టపగలు ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సూర్యవంశీ శివతాండవం చేశాడు. అయుష్ మాత్రే 53 పరుగులు చేసి క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. రెండో వికెట్‌పై ఆయుష్ మాత్రే, వైభవ్ సూర్య వంశీ 142 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

