ఖమెనీ పాలనా కాలంలో ఆ దేశ ప్రజలు చాలాసార్లు కఠిన నిబంధనలను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మృతితో ఇరాన్‌లో పెద్దఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు ఆందోళనకారులు. పలు నగరాల్లో కేకలు వేస్తూ, బాణా సంచా కాల్చుతూ సంబరాలు చేసుకోగా.. ఇస్లామిక్ రిపబ్లిక్ అంతమొందాలనే నినాదాలతో అక్కడి వీధులు మార్మోగినట్టు తెలుస్తోంది. ఆ దేశంలోని పలువురు మహిళలు హిజాబ్ తీసేసి మరీ సంబారాల్లో పాల్గొన్నారు తమ నియంత మరణించాడని హర్షం వ్యక్తం చేస్తూ వీధుల్లో స్టెప్పులేశారు.

