అమెరికా సుప్రీంకోర్టు భారీ సుంకాల జీవోను కొట్టివేసిన కొన్ని గంటల తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా సుంకాల రేటును వెంటనే 15%కి పెంచుతున్నట్లు ప్రకటించారు. ట్రూత్ సోషల్ పై సుదీర్ఘ పోస్ట్‌లో కోర్టు తీసుకున్న “హాస్యాస్పదమైన, పేలవంగా రాసిన, అసాధారణమైన అమెరికన్ వ్యతిరేక నిర్ణయం” అని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుతం ఉన్న 10% ప్రపంచ సుంకాన్ని “పూర్తిగా అనుమతి పొందిన, చట్టబద్ధంగా పరీక్షించిన” 15% స్థాయికి పెంచుతామని,”వెంటనే అమలులోకి వస్తుంది” ఆయన ప్రకటించారు.

