సీనియర్ అధికారి వేధింపులు తాళలేక ఒక అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వ కార్యాలయంలో ఉరి వేసుకుని మరణించాడు. దీనికి ముందు ఒక వీడియో షేర్ చేశాడు. సీనియర్ అధికారి తనను వేధిస్తున్నట్లు ఆరోపించాడు. దేవుడు అతడ్ని శిక్షిస్తాడని పేర్కొన్నాడు.కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సాంఘిక సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న మల్లికార్జున్, శుక్రవారం సాయంత్రం పావగడలోని ఆ శాఖ కార్యాలయంలో ఉరి వేసుకున్నాడు.

