ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. రేపటి మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని, కూటమి ప్రభుత్వానికి చెందిన మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు శివతత్వానికి ప్రతీకగా ఉన్న చీరలను ధరించి సభకు హాజరయ్యారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం వీరంతా ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

