కోనరావుపేట మండలంలోని నిజామాబాద్‌లో బుధవారం ఉదయం ఉపాధి పనుల్లో భాగంగా సర్వాయి కాలువ మరమ్మతు పనుల్లో 10 మంది కూలీలు పనిచేస్తుండగా చెట్టుపై ఉన్న తేనె టీగలు వారిపై దాడి చేశాయి. తేనె టీగలు మీదకు రావడంతో భయపడిపోయిన కూలీలు అక్కడి నుంచి పరుగులు తీశారు. అప్పటికే వారిని తేనెటీగలు విపరీతంగా కుట్టాయి. గాయపడిన వారిని కోనరావుపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది అందుబాటులో లేక..ట్రాలీ ఆటోలో సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి తరలించారు.

