అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మెజార్టీ 2 శాతమే తేడా అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. అర్నెళ్ల తర్వాత జరిగిన ఎంపి ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ 4 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ కుటుంబంలో 3 తరాలు దేశం కోసం ప్రాణాలు అర్పించారని పేర్కొన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీకి సొంత ఇళ్లు కూడా లేదని తెలిపారు. దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని ఐక్యంగా ఉంచే కాంగ్రెస్‌ను కనుమరుగు చేయాలని కుట్ర జరుగుతోందని అన్నారు.

