రీదేవి (ఆగస్టు 13, 1963-24 ఫిబ్రవరి 2018) భారతీయ సినీ నటి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో వందలాది సినిమాలలో కథానాయికగా నటించింది. అందము,అభినయం,నటన లో శ్రీదేవి అగ్రశ్రేణి కథానాయకగా గుర్తింపు సంపాదించింది. ఈమె తమిళనాడు లోని శివకాశిలో జన్మించింది. ఆమె తన నట జీవితాన్ని బాల నటిగా కన్దన్ కరుణై (1967) అనే తమిళ చిత్రంతో మొదలు పెట్టినది శ్రీదేవి తెలుగు సినిమా రంగంలో కూడా అగ్రశ్రేణి కథానాయకిగా కొనసాగింది. దాదాపు అందరు అగ్ర కథానాయకులతో కలసి నటించింది.

