అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తొలిసారిగా అద్బుత ఘట్టం ఆవిష్కృతమైంది. కోనసీమ శిశు గృహం ద్వారా తొలిసారిగా ఒక ఆడశిశువును దత్తతకు ఇచ్చినట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు.కేరళకు చెందిన దంపతులు CARA (Child Adoption Resource Authority) పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసి, 15 నెలల చిన్నారి సంజనను బుధవారం వారికి అప్పగించారు. ఈ దత్తత అనుబంధం రాష్ట్రంలో శిశు సంరక్షణ మరియు దత్తత విధానంలో ఒక సానుకూల ప్రగతిని సూచిస్తున్నదని కలెక్టర్ అన్నారు.

