ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ జన్మదినం(డిసెంబర్ 21) సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు భారీగా సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైఎస్ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. . ‘‘ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’’ అని పవన్ కల్యాణ్ ఎక్స్‌లో పోస్టు చేశారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా జగన్‌కు బర్త్ డే విషెస్ తెలియజేశారు

