విశాఖ, తిరుపతి, కాకినాడ, సత్యసాయి జిల్లా, చీరాల, రాజమహేంద్రవరంలో పర్యాటక ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 55 అజెండా అంశాలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించి సౌర, పవన, హైబ్రిడ్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 160 మెగావాట్లు, 125 మెగావాట్లు ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

