విరాట్ కోహ్లి ( జననం: 1988 నవంబరు 5) ఒక ప్రముఖ భారతదేశపు అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. మలేషియాలో జరిగిన 2008 U/19 క్రికెట్ ప్రపంచ కప్ లో గెలుపొందిన భారత జట్టుకి అతను సారథిగా వ్యవహరించాడు. అతను 2008లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తరఫున, 2009 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోను ఆడాడు ICC ODI రాంకింగ్ లలో 873 పాయింట్ లతో కోహ్లి మొదటి స్థానంలో ఉన్నాడు.

