
చైనాకు చెందిన ఎయిర్ చైనా విమానం సీఎ139 శుక్రవారం హాంగ్‌చౌ నుంచి సియోల్ బయలు దేరింది. ఈ నేపథ్యంలోనే విమానం క్యాబిన్‌లోని ఓవర్ హెడ్ కంపార్ట్‌మెంట్‌లో లిథియమ్ బ్యాటరీ పేలింది. దీంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో విమానంలో ఉన్న వారంత భయంతో అరుపులు, కేకలు పెట్టారు. సకాలంలో స్పందించిన సిబ్బంది మంటల్ని ఆర్పారు. వెంటనే సిబ్బంది విమానం షాంగైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. కానీ విమానంలో ఉన్న వారంత తెగ టెన్షన్ కు గురయ్యారు. లక్ బాగుండీ మంటలు అదుపులోకి వచ్చాయి.