ఢిల్లీలోని భారత్ మండపంలో ఫిబ్రవరి 10న జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో చొక్కాలు విప్పి నిరసనలు తెలిపిన ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఐవైసీ కార్యకర్తలకు సమర్ధనగా ‘యూత్ కాంగ్రెస్ సభ్యులంతా బబ్బర్ షేర్లు. మీరు ఎవరికీ భయపడాల్సిన పని లేదు. మీలో దేశభక్తి రక్తం ఉంది. మీరు హరిత విప్లవం తీసుకువచ్చారు. పరిశ్రమలు తీసుకొచ్చారు. ఐటీ విప్లవం తెచ్చారు. వీటన్నింటికీ మోదీ చరమగీతం పాడారు’ అని రాహుల్ అన్నారు.

