హైదరాబాద్‌లో పెంపుడు పిల్లుల కారణంగా గడిచిన వారం రోజుల్లో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.పిల్లి చనిపోయిందని మూడు రోజుల క్రితం మీర్ పేటకు చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకోగా, పిల్లిని ఇంట్లోకి తీసుకురావద్దన్నందుకు అల్వాల్‌లో నివాసం ఉంటున్న MBBS విద్యార్థిని శ్రేష్ట ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు కోల్పోయింది. ఒక పెంపుడు పిల్లి విషయంలో శుక్రవారం తల్లితో శ్రేష్ణ వాగ్వాదం జరిగింది. అప్పుడుపిల్లిని ఇంట్లోకి తీసుకురావద్దని తల్లి శ్రేష్టను మందలించింది.

