ఇజ్రాయెల్, అమెరికా దేశాలు ఇరాన్‌పై విరుచుకుపడుతుండటంతో.. ఇరాన్ కూడా ప్రతిదాడులు చేస్తోంది. ఈ క్రమంలో ఒమన్ తీరం లోని వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. ఈ దాడుల్లో భారతదేశానికి చెందిన ముగ్గురు నావికులు మృతి చెందినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ వెల్లడించింది. పర్షియన్ గల్ఫ్ సమీపంలో చిక్కుకొన్న భారతీయ నావికులకు తక్షణ సాయం అందించడానికి, వారిని భారత్‌కు తరలించడానికి ప్రత్యేక ప్రతిస్పందన బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

