ప్రముఖ మేసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్కు రష్యా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. దానిని బ్లాక్ చేసింది, తద్వారా ప్రజలకు అందుబాటులో లేకుండా చేసింది. తమ దేశ చట్టాలకు వాట్సాప్ కట్టుబడి ఉండేందుకు విముఖత చూపడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వాట్సాప్ స్థానంలో మ్యాక్స్ అనే మేసేజింగ్ యాప్ను రష్యా తీసుకురానుంది. ‘మా యాప్ను పూర్తిగా బ్లాక్ చేసేందుకు రష్యా ప్రయత్నించింది. 100 మిలియన్ల మంది యూజర్లను భద్రతమైన మేసేజింగ్ వ్యవస్థకు దూరం చేయడం తిరోగమన చర్య. అని ఎక్స్ వేదికగా వాట్సాప్ పేర్కొంది.

