ఐసీసీ వుమెన్స్ వరల్డ్ కప్ 2025 ఫైనల్ మ్యాచ్ నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కూడా నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియానికి వెళ్లారు.
లోకేష్‌తో పాటు ఆయన సతీమణి నారా బ్రాహ్మణి, కొడుకు దేవాన్ష్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సచిన్‌తో దిగిన ఫొటోలను కూడా లోకేష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

