టీ20 వరల్డ్‌కప్‌లో సంచలన విజయం నమోదైంది. పటిష్ఠమైన ఆస్ట్రేలియాకు పసికూన జింబాబ్వే షాకిచ్చింది. కొలంబో వేదికగా శుక్రవారం ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 23 పరుగుల తేడాతో విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. 170 పరుగుల ఛేదనలో ఆసీస్ 19.3 ఓవర్లలో 146 పరుగులకే పరిమితమైంది. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజర్భానీ 4, బ్రాడ్ ఇవాన్స్ 3, మసకజ్దా, ర్యాన్ బ్లర్ తలో వికెట్ దక్కించుకున్నారు.

